Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucky Plants: ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి మనం రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని ప్రత్యేకమైన మొక్కలు కేవలం అందాన్ని మాత్రమే కాదు, ఆదాయాన్ని సుఖసంతోషాలను, లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా మోసుకొస్తాయి. సరైన దిశలో ఉంచిన ఫర్నిచర్ ఇంటికి ఎలాగైతే ప్రశాంతతను ఇస్తుందో, అలాగే సరైన దిశలో పెంచే లైవ్ ప్లాంట్స్ ఆర్థిక ఇబ్బందులను తొలగించి, ఇంటి ప్రగతిని పరుగులు పెట్టిస్తాయని నమ్ముతారు. మీ ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ నిండి, అపారమైన సంపద రావాలనుకుంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం అద్భుతమైన ఫలితాలనిచ్చే ఆ 5 ‘లక్కీ ప్లాంట్స్’ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. మనీ ప్లాంట్
మీ ఇంట్లోకి డబ్బును ఆకర్షించడంలో మనీ ప్లాంట్ మొక్క అత్యంత ఆదరణ పొందింది. దీనిని ఎక్కడ పెట్టాలంటే.. ఈ మొక్కను ఇంటికి ఆగ్నేయ (సౌత్-ఈస్ట్) మూలలో ఉంచడం అత్యంత శుభప్రదం అని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ మొక్కను మీ ఇంట్లో పెట్టుకుంటే తప్పకుండా మీరు ఒక ముఖ్యమైన రూల్‌ను గుర్తించుకోవాలి. అదే మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ కింద నేలపై పాకకుండా చూసుకోవడం. వాటిని ఎల్లప్పుడూ ఏదైనా స్టిక్ లేదా తాడు సహాయంతో పైకి పాకించాలి. పైకి ఎదిగే తీగలు మీ జీవితంలో ఆర్థిక ఎదుగుదలకు సూచికలు అని వాస్తు శాస్త్రం చెబుతుంది.
Also Read
- Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
- Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
- Ring Removal Tips: మీ ఉంగరం వేలికి ఇరుక్కుపోయిందా..? సింపుల్‌గా తీసే చిట్కాలు ఇవే..
- Kitchen Cleaning Hacks: టీ జల్లెడపై నల్లటి మచ్చలా? ఈ ఇంటి చిట్కాతో క్షణాల్లో శుభ్రం..
2. తులసి మొక్క
హిందూ సాంప్రదాయంలో తులసిని అత్యంత పవిత్రమైనదిగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇది మీ ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ఈ మొక్కను ఎక్కడ పెట్టాలంటే.. దీనిని ఇంటికి ఉత్తర లేదా తూర్పు దిశలో నాటడం చాలా మంచిదట. దీనిని మీ ఇంట్లో పెడితే తప్పకుండా పాటించాల్సిన రూల్ ఏంటంటే.. మీ తులసి కోట చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో తులసి మొక్క వద్ద చిన్న దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లుతాయి.
3. జేడ్ ప్లాంట్
దీని చిన్నటి, గుండ్రటి ఆకులు నాణేలను పోలి ఉంటాయి. అందుకే దీనిని ‘లక్కీ ప్లాంట్’ అని పిలుస్తారు. ఈ మొక్కను మీ ఇంట్లో ఎక్కడ పెట్టాలంటే.. దీనిని మీ ఇంటి ప్రధాన ద్వారం (మెయిన్ గేట్) లోపలి వైపు కుడి పక్కన ఉంచాలి. ఈ మొక్క ఇంట్లోకి వచ్చే ధన ప్రవాహాన్ని పెంచుతుందని, కెరీర్లో వచ్చే అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
4. లక్కీ బాంబూ
ఈ మొక్కను ఇంట్లోనే సులభంగా పెంచవచ్చు. ఎందుకంటే ఇది మట్టిలోనే కాకుండా కేవలం నీటిలో కూడా సూపర్‌గా పెరుగుతుంది. దీనిని ఎక్కడ పెట్టాలంటే.. ఈ మొక్కను మీ ఇంటికి తూర్పు దిశలో ఉంచాలి. ఈ మొక్క మీ కుటుంబంలో సంతోషాన్ని, ప్రశాంతతను తెస్తుంది. ఇది అదృష్టానికి చిహ్నం కావడంతో, చాలా మంది దీనిని ఒకరికొకరు గిఫ్ట్‌గా కూడా ఇస్తుంటారు.
5. క్రాసులా
దీనిని ‘మనీ ట్రీ’ అని కూడా పిలుస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఈ మొక్కను పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీనిని ఎక్కడ పెట్టాలంటే.. దీనిని మీ ఇంటికి ఉత్తర మూలలో ఉంచాలి. ఎందుకంటే ఉత్తర దిశను ధన దేవత అయిన కుబేరుడి స్థానంగా భావిస్తారు. ఈ మొక్కకు పెద్దగా సంరక్షణ అవసరం లేదు. ఇది ఇంట్లో ఉంటే ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
గమనించాల్సిన ముఖ్యమైన వాస్తు చిట్కాలు:
* మీ ఇంట్లో ఏదైనా మొక్క ఎండిపోయినా లేదా ఆకులు పసుపు రంగులోకి మారినా వెంటనే వాటిని తొలగించాలి. వాడిపోయిన మొక్కలు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతాయి.
* మొక్కల కుండీలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎప్పుడూ క్లీన్‌గా ఉంచాలి. అక్కడ గనక మురికి ఉంటే పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం నిలిచిపోతుంది.
* పైన పేర్కొన్న మొక్కల నుంచి పూర్తి ఫలితాలు పొందాలంటే, వాటిని కచ్చితంగా చెప్పిన దిశలలోనే ఉంచడానికి ప్రయత్నించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
-
Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
-
Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
-
Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!