Sperm Count: ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ ట్రెండ్‌గా టైట్ జీన్స్, టైట్ అండర్ గార్మెంట్స్ ధరించడం యువకుల్లో ఎక్కువవుతోంది. స్టైలిష్‌గా కనిపించాలనే ఉద్దేశ్యంతో చాలామంది వీటిని ఎక్కువగా వాడుతున్నారు. కానీ ఇవి శరీరానికి, ముఖ్యంగా సంతానశక్తికి హాని కలిగిస్తాయని మీకు తెలుసా?
టైట్ దుస్తులు ఎందుకు ప్రమాదకరం?
మెడికల్ రీసెర్చ్ ప్రకారం, టైట్ అండర్‌గార్మెంట్స్ లేదా జీన్స్ ధరించడం వల్ల టెస్టికల్స్ (అండకోశాలు) చుట్టూ ఉష్ణోగ్రత పెరుగుతుంది. సాధారణంగా స్పెర్మ్ (వీర్యకణాల) ఉత్పత్తి సజావుగా జరగడానికి అండకోశాలు శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా తక్కువ ఉష్ణోగ్రతలో ఉండాలి. ఈ టెస్టికల్స్ శరీరానికి బయట ఉండటానికి ఇదే కారణం. కానీ టైట్ దుస్తులు ధరించడం వల్ల అవి శరీరానికి దగ్గరగా చేరి వేడిని బయటకు పంపలేవు. దీంతో స్పెర్మ్ ఉత్పత్తి మందగిస్తుంది.
తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. లూజ్ లేదా రెగ్యూలర్ ఫిట్ అండర్‌వేర్ వాడే పురుషుల స్పెర్మ్ కౌంట్, టైట్ అండర్‌వేర్ ధరించే వారితో పోలిస్తే ఎక్కువగా ఉంది. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం టైట్ అండర్‌గార్మెంట్స్ వాడే వారి స్పెర్మ్ కౌంట్ 25% తగ్గినట్లు గుర్తించారు నిపుణులు. ఇకపోతే వీటితోపాటు స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు మోకాలిపై పెట్టుకుని పనిచేయడం లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజ్‌ల నుంచి వచ్చే వేడి ప్రభావం వల్ల కూడా ప్రభావం పడుతుంది. ఇంకా మొబైల్‌ను తరచుగా ప్యాంట్ జేబులో పెట్టుకోవడం, అధిక మద్యం, ధూమపానం వంటి అలవాట్లు కూడా టెస్టోస్టెరోన్ స్థాయిలను తగ్గించి ఫర్టిలిటీని దెబ్బతీస్తాయి.
MEGA 157 : మెగాస్టార్ సినిమా టైటిల్ చెప్పేసిన అనిల్ రావిపూడి.. అదిరిందిగా
మరి ఫర్టిలిటీ కాపాడుకునే మార్గాలు చూసినట్లయితే.. మొబైల్‌ను ప్యాంట్ జేబులో పెట్టకండి. అలాగే ముక్యముగా శరీర శుభ్రత పాటించండి. కుదిరితే వ్యాయామాన్ని అలవాటు చేసుకోండి. ముక్యముగా మద్యం, పొగ త్రాగడం మానేయండి. ఇంకా శ్వాస తీసుకునే కాటన్ ఫ్యాబ్రిక్ (breathable fabric) తో చేసిన లూజ్ అండర్‌గార్మెంట్స్ వాడండి. గుడ్లు, వాల్‌నట్స్, బెర్రీలు, తాజా పండ్లు, కూరగాయలు వంటి సంతులిత ఆహారం తీసుకోండి. ఇక చివరగా రాత్రి నిద్రపోయే సమయంలో టైట్ దుస్తులు విడిచి లూజ్, సౌకర్యవంతమైన బట్టలు ధరించాలి. మొత్తం మీద టైట్ దుస్తులు స్టైల్ కోసం వాడినా, అవి ఫర్టిలిటీపై ప్రతికూల ప్రభావం చూపుతాయని శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయి. కాబట్టి అబ్బాయిలు జాగ్రత్త వహించడం చాలా అవసరం.
