NTV Telugu Site icon

Thyroid Control: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఇది మీకోసమే..

Walnuts

Walnuts

థైరాయిడ్ సమస్యతో చాలా మంది బాధ పడుతుంటారు.. మహిళలు ఈ సమస్యతో బాధ పడుతున్నారు.. ఒక్కసారి ఈ సమస్య వస్తే ఇక పోవడం చాలా కష్టం.. ఈ థైరాయిడ్ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైపో థైరాయిడిజం రెండోది హైపర్ థైరాయిడిజం.. దీన్ని మెడిసిన్ ద్వారా మాత్రమే కాదు న్యాచురల్ గా కూడా తగ్గించుకోవచ్చు.. ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఎక్కువ హార్మోన్ విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం అని అంటారు. అయితే ఎక్కువగా హైపోథైరాయిడిజం అనేదే కనబడుతుంది. చాలా తక్కువ మందిలో హైపర్ థైరాయిడిజం కనబడుతుంది.. ఈ సమస్యను వెంటనే గుర్తించి చికిత్సను తీసుకోవడం మంచిది.. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి..అధిక బరువు పెరగడం, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవటం, మలబద్ధకం, ఒత్తిడి, తరచుగా నీరసం వంటివి వస్తూ ఉంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే వాల్ నట్స్ ను వాడాలని నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే ఈ సమస్య తగ్గుందో చూద్దాం..

వాల్ నట్స్ డ్రై ఫ్రూట్స్ లో ఒకటి.. వీటిలో శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి.. వీటిని మూడు లేదా నాలుగు గంటలు తేనెలో నానబెట్టి తీసుకోవడం వల్ల ఈ థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.. ఇక వాల్ నట్స్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.. రోజు తీసుకుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చునని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.