NTV Telugu Site icon

Cycling: సైక్లింగ్‌తో క్యాన్సర్ దూరమవుతుందా? నిజమెంత?

Cycling Benefits

Cycling Benefits

The Health Benefits Of Cycling: క్యాన్సర్.. అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఇది ఒకటి. ఖరీదైన చికిత్స చేయించుకుంటే గానీ, దీన్నుంచి ఉపశమనం పొందడం సాధ్యం కాదు. మన శరీరంలో ఒక క్రమ పద్ధతిలో ఉండే కణ విభజనలు.. కొన్ని సందర్భాల్లో నియంత్రణ లేకపోవడం వల్ల చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది, కణ సమూహాలను ఏర్పరుస్తాయి. దీన్నే ట్యూమర్ లేదా క్యాన్సర్ అని అంటారు. మూడింట రెండొంతుల క్యాన్సర్‌ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయి. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి.

Cancer with Eating Meat: నాన్‌ వెజ్‌ తింటే క్యాన్సర్‌..? నిజమెంత..?

అయితే.. సైకిల్ తొక్కడం ద్వారా ఈ క్యాన్సర్ సమస్యలు దూరమవుతాయని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. అవును.. మీరు చదువోతోంది అక్షరాల నిజం. మరీ ముఖ్యంగా.. నిత్యం సైక్లింగ్ చేయడం ద్వారా పెద్దప్రేగు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి తగ్గుముఖం పడతాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు.. ఈ సైక్లింగ్ ద్వారా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చని పరిశోధనల్లో తేలింది. అధికబరువు, గుండెజబ్బులు, క్యాన్సర్, మానసిక సమస్యలు, షుగర్ వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఉదయం, సాయంత్రం వేళలలో ఖాళీ సమయం దొరికినప్పుడు.. సైకిల్ తొక్కుతూ హ్యాపీగా మంచి బెనిఫిట్స్ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Union Budget 2023: ఉపాధి హామీ పథకానికి కోత..ఇళ్లు కొనేవారికి గుడ్‌న్యూస్

సైకిల్ తొక్కడం వల్ల శారీరక, మానసిక సమస్యలు దూరమవుతాయి. ఈ సైక్లింగ్ జీవక్రియ రేటును పెంచి, శరీర కొవ్వుని తగ్గించేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గుతాయి. అయితే, సైక్లింగ్‌తో పాటు హెల్దీ ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. రెగ్యులర్‌గా సైక్లింగ్ చేస్తే.. హృదయ సంబంధ వ్యాధులైన స్ట్రోక్, హై బీపీ, గుండెపోటు వంటి సమస్యలు చాలావరకు దూరమవుతాయి. ఈ సైక్లింగ్ వల్ల గుండెకి, ఊపిరితిత్తులకి రక్తప్రసరణ మెరుగ్గా అవుతుంది. ఫలితంగా.. గుండె కండరాలు బలంగా తయారవుతాయి, గుండె సమస్యలు తగ్గుతాయి. అదే విధంగా.. రక్తంలో కొవ్వు శాతం కూడా తగ్గిపోతుంది. ఈ సైక్లింగ్ వల్ల టైప్ 2 డయాబెటిస్ కూడా దూరమవుతుంది.

Union Budget 2023: బడ్జెట్‌లో క్రీడారంగానికి భారీ నిధులు..అందుకోసమేనా!

సాధారణంగా.. ఈ షుగర్ వ్యాధి శారీరక శ్రమ లేకపోవడం వల్లే వస్తుంది. దీంతో.. రోజుకు 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు సైకిల్ తొక్కాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఓ పరిశోధనలో.. ఎక్కువగా సైకిల్ తొక్కేవారికి షుగర్ వచ్చే ప్రమాదం 40 శాతం తగ్గుతుందని తేలింది. బోన్ ప్రాబ్లమ్స్‌తో బాధపడేవారికి ఈ సైక్లింగ్ గొప్ప వర్కౌట్. సైక్లింగ్ చేస్తే వల్ల ఆర్థరైటిస్ తగ్గుతుంది. ఎముకలని బలంగా తయారు చేస్తుంది. ఫలితంగా.. కీళ్ళనొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తోంది. అయితే.. సైక్లింగ్ చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.

 

<p style=”font-size: 10px;”><span style=”color: red;”>నోట్ :</span> ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.</p>

Show comments