చింతపండు ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి.. చింతపండును రకరకాల వంటల్లో వాడుతారు.. అయితే కొంతమందికి పులుపు అంటే చాలా ఇష్టం.. అందుకే చింతపండును తింటూనే ఉంటారు.. చింతపండు మాత్రమే కాకుండా చింతకాయలను కూడా ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటారు. మామూలుగా చింత కాయ పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చింతపండును అతిగా తినడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయట.. చింతపండును ఎక్కువగా తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పుల్లగా ఉండడం వలన దంతాల సమస్యకు కారణం అవుతుంది. దంతాల సమస్య ఉన్నవారు చింతపండును ఎక్కువగా తింటే ఆ నొప్పి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలు తమ బహిష్టు సమయంలో చింతపండు ను అస్సలు తినకూడదు. బహిష్టు సమయంలో చింతపండును గానీ, చింతపండుతో చేసిన రసాలను గానీ తిన్నా, తాగినా కడుపునొప్పి మరింత తీవ్రం అవుతుంది.. ఉదయం లేవగానే పరగడుపున చింతపండును తినడం వల్ల పొత్తికడుపు నొప్పి వస్తుంది.. ఉదర సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
ఇకపోతే అజీర్తి అసిడిటి సమస్యను పెంచుతుంది. అలాగే చింతపండును మితంగా మాత్రేమే తినాలి. చింతపండులో ఉండే సిట్రిక్ యాసిడ్ వలన కడుపులో గ్యాస్ సమస్యలు తయారవుతాయి. కాబట్టి పరిగడుపున చింతపండు అసలు తీసుకోకూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు చింతపండు తీసుకోకుండా ఉండడం మంచిది.. ఇలా తీసుకుంటే ఆ సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.. కొన్ని సార్లు మోషన్స్ కూడా అవుతాయని చెబుతున్నారు.. సో చింతపండు ను ఎక్కువగా మాత్రం అసలు తినకండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.