NTV Telugu Site icon

Sweet Corn Pakora : మొక్కజొన్న పకోడీలను ఇలా చేస్తే చాలు.. టేస్ట్ అదిరిపోతుంది అంతే..

Sweet Corn P[akoda

Sweet Corn P[akoda

వర్షాకాలం వస్తే చాలు ఎక్కడ చూసిన స్వీట్ కార్న్ కండీలు కనిపిస్తాయి.. ప్రతి సీజన్ లో ఇప్పుడు ఇవి దొరుకుతున్నాయి.. వీటితో ఎన్నో రకాల వెరైటీలను తయారు చేసుకోవచ్చు.. గారెలు, రైస్, ఉడకపెట్టి సలాడ్స్ ఇలా ఎన్నో చేసుకోవచ్చు.. అందులో స్వీట్ కార్న్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో కార్న్ పకోడా కూడా ఒకటి..స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ పకోడాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. స్వీట్ కార్న్ తో రుచిగా, క్రిస్పీగా పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు..

స్వీట్ కార్న్ గింజలు – ఒక కప్పు,

బియ్యం పిండి – అర కప్పు,

తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు,

పచ్చిమిర్చి – 2,

తరిగిన కొత్తిమీర – కొద్దిగా,

అల్లం – ఒక ఇంచు ముక్క,

కరివేపాకు -ఒక రెమ్మ, ఉప్పు – తగినంత,

కారం – అర టీ స్పూన్,

జీలకర్ర – అర టీస్పూన్,

నూనె – డీప్ ఫ్రైకు సరిపడా..

తయారీ విధానం..

ముందుగా కండీల నుంచి గింజలను తీసుకోవాలి.. అందులో కొన్ని గింజలను మిక్సీలో వేసి తరువాత ఇందులో కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పునుగుల్లా వేసుకోవాలి. ఈ పకోడీలను ఒక నిమిషం పాటు వేయించిన తరువాత గంటెతో అటూ ఇటూ కదుపుతూ వేయించాలి.. మంటను సిమ్ లో పెట్టి మరీ ఎర్రగా క్రీస్పీగా వచ్చేవరకు చెయ్యాలి.. అంతే ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ పకోడీలు రెడీ అయ్యినట్లే.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి.. వీటిని చట్నీ లేదా టమోటా కేచప్ తో తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది అంతే..