Sugar-Free Lassi Recipe: మండే ఎండ నుంచి తక్షణ ఉపశమనం.. షుగర్ లేకుండా క్షణాల్లో టేస్టీ లస్సీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar-Free Lassi Recipe: వేసవి ఎండలు మండిపోతున్న ఈ సమయంలో చల్లని లస్సీ తాగితే శరీరానికి వెంటనే ఉపశమనం లభిస్తుంది. లస్సీ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా అలసటను తగ్గించి ఉల్లాసాన్ని ఇస్తుంది. అయితే చాలా మంది లస్సీలో ఎక్కువగా చక్కెర వేయడం వల్ల దాన్ని తాగేందుకు వెనుకాడుతుంటారు. బరువు పెరగడం, ఆరోగ్య సమస్యల భయం కారణంగా చాలామంది లస్సీకి దూరంగా ఉంటారు. అలాంటి వారికోసమే చక్కెర లేకుండా సహజమైన తీపితో లస్సీ తయారు చేసే సులభమైన రెసిపీ ఇది. ఈ లస్సీలో పంచదారకు బదులుగా బెల్లం పొడి లేదా ఖర్జూరాలను ఉపయోగిస్తారు. దీంతో రుచి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. బెల్లం శరీరానికి శక్తినిస్తే, ఖర్జూరాలు పోషకాలు అందిస్తాయి.
కావాల్సిన పదార్థాలు
* తాజా చిక్కటి పెరుగు – 2 కప్పులు
* నానబెట్టిన ఖర్జూరాలు – 4 నుంచి 5 లేదా బెల్లం పొడి – 3 టీస్పూన్లు
* యాలకుల పొడి – అర టీస్పూన్
* చల్లని పాలు – పావు కప్పు
* కుంకుమపువ్వు దారాలు – కొద్దిగా
* ఐస్ క్యూబ్స్ – అవసరమైనంత
* మీగడ – ఐచ్చికం
Also Read
తయారీ విధానం
ముందుగా ఖర్జూరాలను కొద్దిగా గోరువెచ్చని పాలలో 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటిని మెత్తగా రుబ్బి గుజ్జుగా తయారు చేసుకోవాలి. బెల్లం వాడుతున్నట్లయితే నేరుగా కలపవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ లేదా బ్లెండర్లో పెరుగు, ఖర్జూర గుజ్జు లేదా బెల్లం పొడి, యాలకుల పొడి వేసి బాగా బ్లెండ్ చేయాలి. పెరుగు నునుపుగా మారి పైభాగంలో నురుగు వచ్చే వరకు కలపాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి తేలికగా బ్లెండ్ చేయాలి. అనంతరం గ్లాసులో పోసి పైన కుంకుమపువ్వు దారాలు, కొద్దిగా మీగడ వేసి చల్లగా సర్వ్ చేయాలి.
ఆరోగ్య ప్రయోజనాలు
ఈ చక్కెరలేని లస్సీ తాగడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సహజమైన తీపి వల్ల రుచి తగ్గకుండా ఆరోగ్యకరమైన పానీయం ఆస్వాదించవచ్చు. వేసవిలో ప్రతిరోజూ ఒక గ్లాస్ తాగితే శరీరం తాజాగా ఉంటుంది.
తాజావార్తలు
-
Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
-
Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
-
INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
-
Donald Trump: “అబ్దుల్.. నువ్వొక జిహాదీవి”.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!