Site icon NTV Telugu

Students Study Tips: విద్యార్థులు పరిక్షల్లో టాప్ చేయాలంటే వీటిని పాటిస్తే సరి.. మీరే బెస్ట్.!

Students Study Tips

Students Study Tips

Students Study Tips: ఇది వరకు రోజులతో ప్రస్తుత విద్యార్థులు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. పరీక్షల్లో టాప్ మార్కులు సాధించే విద్యార్థులు కేవలం ఎక్కువగా చదవడం మాత్రమే కాకుండా, స్మార్ట్‌గా చదివి విజయం సాధిస్తున్నారు. నిజానికి ఇప్పుడున్న విద్యార్థులు అనుసరించే స్టడీ టెక్నిక్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే.. చదినవి మరిచిపోకుండా, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఒత్తిడిని తగ్గించుకుంటూ, వారు తమ టార్గెట్లను చేరుకుంటున్నారు. మరి ఈ ఇంటెలిజెంట్ పిల్లలు పాటించే కొన్ని స్టడీ టిప్స్ గురించి తెలుసుకుందామా..

కేవలం పరీక్షల సమయం ముందు మాతరమే చదివేలా కాకుండా.. ముందు నుంచే సిలబస్‌ను విభజించుకుని స్టడీ ప్లాన్ చేసుకోవాలి. ముందస్తు ప్రిపరేషన్ వల్ల కన్‌ఫ్యూజన్ తగ్గి, కంటెంట్‌ను బాగా గ్రహించగలుగుతారు. పుస్తకాలను కేవలం చదవడమే కాకుండా.. స్వయంగా ప్రశ్నలు వేయడం, ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించడం, వాటిని క్షుణంగా అర్థం చెప్పుకోవడం వంటి యాక్టివ్ రీకాల్ పద్ధతిని ఫాలో అవ్వాలి. ఇది మెమరీను బలోపేతం చేస్తుంది.

Kidney Stones Alert: వీటిని ఎక్కువ తింటున్నారా? అయితే కిడ్నీలలో రాళ్లు రావడం గ్యారెంటీ.. జాగ్రత్త సుమీ..!

నిజానికి విద్యార్థులు ఒకేసారి అన్ని విషయాలు కూర్చొని చదవలేరు. కాబట్టి ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తూ, మళ్లీ మళ్లీ చూసే స్పేస్డ్ రిపిటిషన్ టెక్నిక్ ను ఉపయోగిస్తే సరి. ఇంకా ఏదైనా విషయాన్ని అర్థం చేసుకొని, సారాంశాన్ని తక్కువ పదాల్లో చెప్పగలగడం, సమస్యను ఏ కోణంలో చూసినా పరిష్కరించడం అలవాటు చేసుకోవాలి. కేవలం బట్టి కొట్టి చదవడం వల్ల విజయం సాధ్యం కాదు. అంతేకాక గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లు పరిష్కరించటం ద్వారా పేపర్ ఫార్మాట్, టైం మేనేజ్మెంట్, బలహీనతలు అన్నీ అర్థం చేసుకోవచ్చు.

Minister Seethakka: పేదల కోసం పోరాడినందుకు కేసు… కోర్టు ఎదుట హాజరైన మంత్రి సీతక్క

ఇక పరీక్షల సమయంలో 25 నిమిషాల ఫోకస్‌డ్ స్టడీ + 5 నిమిషాల బ్రేక్ అనే టెక్నిక్ తో మెదడును సిద్ధం చేసుకోవాలి. అలాగే పరీక్ష సమీపంలో మాత్రమే కాకుండా.. మొదటి నుంచి వారానికి ఒక్కసారి రివిజన్ చేస్తూ, లాంగ్ టర్మ్ మెమరీలో విషయాలను రివిజన్ చేస్తే సరిపోతుంది. అలాగే పాజిటివ్ మైండ్‌ సెట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం జాగింగ్, ప్రాణాయామం, తేలికపాటి వ్యాయామం వంటివి చేస్తూ ఉంటే పాజిటివ్ ఆలోచనలు చేసి విజయాని సాధించవచ్చు.

Exit mobile version