Stretch Marks: కోడి గుడ్డుతో దీన్ని కలిపి రాస్తే చాలు..స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్ట్రెచ్ మార్క్స్.. ఇవి ఒకసారి వస్తే పోవు అని చాలామంది అనుకుంటారు.. కానీ ఇంట్లో దొరికే వాటితోనే పోతాయని నిపుణులు చెబుతున్నారు.. పొత్తికడుపు, తొడలు, చంకల దగ్గర స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. బరువు తగ్గిన వారికి, ముఖ్యంగా ఆడవారు డెలివరీ అయ్యాక స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని తగ్గించేందుకు చాలా మంది క్రీమ్స్ వాడతారు. అలా కాకుండా కొన్ని నేచురల్ ప్రోడక్ట్స్‌ని వాడి సమస్యని తగ్గించుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూద్దాం..
*. కొబ్బరి నూనె పొడి చర్మం, చర్మంపై మచ్చలు, మొటిమలు, సాగిన గుర్తులని తగ్గిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది..ముందుగా కొబ్బరినూనె తీసుకుని స్ట్రెచ్ మార్క్స్‌పై రాసి మసాజ్ చేయండి.. రోజు ఇలా చేయొచ్చు.. ఇలా రాత్రి క్రమం తప్పకుండ అప్లై చేస్తే కొద్ది రోజుల్లోనే మచ్చలు తగ్గిపోతాయి..
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
*. అలోవెరా జెల్ అనేది మంచి మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. ఇది చర్మాన్ని స్మూత్‌గా, మెరిసేలా, హైడ్రేటెడ్‌గా చేస్తుంది. ఇది చర్మంపై మచ్చలు, సాగిన గుర్తులని దూరం దూరం చేస్తుంది.. అలోవెరా జెల్‌ని రెగ్యులర్‌గా స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి మసాజ్ చేయాలి. దీని వల్ల సమస్య తగ్గుతుంది..
*. ఆలు రసంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిని అప్లై చేయడం వల్ల చర్మంపై నలుపు తగ్గుతుంది. ఈ రసం రాస్తే మహిళల్లో చేతులు, పొత్తికడుపు, తొడలపై వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి.. దీనిని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా స్ట్రెచ్ మార్క్స్, మచ్చలు త్వరగా తగ్గిపోతాయి..
*. ఆలివ్ ఆయిల్ కూడా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా రాస్తే చర్మంపై మచ్చలు, డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. స్ట్రెచ్ మార్క్ కూడా తగ్గిపోతుంది..ఆలివ్ ఆయిల్‌ని కాస్తా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి వదిలేయండి. అరగంట తర్వాత దీనిని నీటితో క్లీన్ చేయండి. సమస్య తగ్గిపోతుంది.. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది..
*. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అదనంగా, దాని జిగురు లాంటి పదార్థం చర్మానికి మెరుపుని అందిస్తుంది. ఈ గుడ్డులోని తెల్లసొన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మంపై ముడతలు, స్ట్రెచ్ మార్క్స్‌ని పోగొట్టడంలో సాయపడుతుంది. ముందుగా గుడ్డులోని తెల్ల సోనాను వేరు చేసి దానికి గ్లిజరిన్ వేయాలి. పావు చెంచా మాత్రమే. దీనిని స్ట్రెచ్ మార్క్స్ రాసి ఆరిపోయాక నీటితో క్లీన్ చేయండి.. మార్క్స్ త్వరగా పోతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!