Site icon NTV Telugu

Sleeping Tips : రాత్రి హాయిగా నిద్రపట్టాలంటే పాలల్లో దీన్ని కలుపుకొని తాగాలి..

Slpng Tips

Slpng Tips

ఈరోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు.. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు.. నిద్ర బాగా పట్టాలంటే అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. అశ్వగంధలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అశ్వగంధను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒత్తిడిని దూరం చేసి మంచి నిద్ర పట్టడానికి అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. . అశ్వగంధలో ఉండే త్రి ఇథైల్ గ్లైకాల్ అనేది నిద్ర పట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది… ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ పాలు తాగడం చాలా మందికి అలవాటు.. గోరువెచ్చని పాలలో పావు స్పూన్ పొడిలో సగం అశ్వగంధ పొడి కలిపి తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. ఈ విధంగా కొన్ని రోజుల పాటు తీసుకుంటే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఈ పాలను తాగడం వల్ల డిప్రెషన్ లో ఉన్న వారికి చాలా మంచి ప్రయోజనాలు అందిస్తుంది. డిప్రెషన్ లో ఉన్నవారికి ఉండే నెగటివ్ ఆలోచనలు తగ్గించి పాజిటివ్ ఆలోచనలు పెరిగేలా చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది..

అంతేకాదు.. టెన్షన్లు, ఒత్తిడి, కంగారు, ఆందోళన, హడావుడి వంటి బిజీ జీవనశైలి ఉన్నవారు ఈ పొడిని వాడితే మంచి ఉపశమనం కలిగించటమే కాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి అశ్వగంధ పొడి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.. హాయిగా నిద్రపోతే ఎటువంటి సమస్యలు రావని చెప్పాలి.. మైండ్ కు ఎక్కువగా రెస్ట్ దొరికితే తర్వాత రోజు ఉల్లాసంగా, ఉత్సహంగా ఉంటారు.. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version