Site icon NTV Telugu

Garlic Rice Recipe: ఈ రైస్ ఒక్కసారి చేసుకొని తిన్నారో.. ఇక మీరు బిర్యానీ జోలికి వెళ్లరు..!

Garlic Rice Recipe

Garlic Rice Recipe

Garlic Rice Recipe: రోజూ అదే రకం భోజనం తిని బోర్ కొడుతుందా? బిర్యానీ లాంటి రుచితో, కానీ చాలా సింపుల్‌గా చేసుకునే ఒక స్పెషల్ రైస్ రెసిపీ మీకోసం. ఈ గార్లిక్ రైస్ ఒక్కసారి ట్రై చేస్తే చాలు… ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. లంచ్‌కైనా, లంచ్ బాక్స్‌కైనా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

ఈ రైస్ ప్రత్యేకత ఏంటి?
ఈ రైస్‌లో ఎలాంటి ఘాటైన మసాలాలు అవసరం లేదు. సాధారణంగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే సూపర్ టేస్టీగా తయారవుతుంది. ముఖ్యంగా వెల్లుల్లి వాసన, క్రంచీ మసాలా పౌడర్ కలిసి రైస్‌కు అద్భుతమైన రుచి ఇస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే రిసిపీ ఇది. మరి దీనిని ఎలా చేయాలో చూసేద్దామా..

Bhagavanth Kesari Trends: జననాయకుడి దెబ్బకి బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రేండింగ్ లోకి..!

రుచికి రహస్యం ఇదే..
ముందుగా శనగపప్పు, కందిపప్పు, పల్లీలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాలను ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి, తరువాత వెల్లుల్లిని కూడా కాస్త క్రిస్పీగా వేయించడం ఈ రైస్‌కు అసలు హైలైట్. వీటన్నిటినీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ చేయడం వల్ల, రైస్ తింటున్నప్పుడు ప్రతి ముక్కలో క్రంచ్, ఫ్లేవర్ బాగా తెలుస్తాయి. అదే ఆయిల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసి, ముందే సిద్ధం చేసుకున్న మసాలా పౌడర్‌ను కలిపితే ఇంటి మొత్తం ఘుమఘుమలతో నిండిపోతుంది.

రైస్ ఎలా ఉండాలి?
ఈ రైస్ రుచిగా రావాలంటే అన్నం పొడి పొడిగా ఉండటం చాలా ముఖ్యం. ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు వేసి కుక్కర్‌లో ఉడికిస్తే సరైన టెక్స్చర్ వస్తుంది. ముద్దగా అయితే ఈ రెసిపీకి సెట్ కాదు. మసాలాలో రైస్ వేసి, కొత్తిమీరతో కలిపి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్‌లో కలిపితే ‘సూపర్ టేస్టీ గార్లిక్ రైస్’ రెడీ.

Meenakshi Chaudhary: సుశాంత్ తో డేటింగ్, పెళ్లి.. మీనాక్షి చౌదరి ఏమందంటే..!

బిర్యానీకి పోటీగా నిలిచే రుచి:
రుచి విషయంలో ఈ రైస్ ఏమాత్రం బిర్యానీకి తీసిపోదు. పైగా తేలికగా జీర్ణమవుతుంది.. హెల్దీ కూడా. టైమ్ తక్కువగా ఉన్న రోజుల్లో, లేదా పిల్లల లంచ్ బాక్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. ఒక్కసారి ట్రై చేసి చూడండి.. మీరే బిర్యానీ అవసరమే లేదని అంటారు. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో తెలపండి.

Exit mobile version