ఇటీవలి కాలంలో అందరిచే ఆదరణ పొందుతున్న సిద్ధ వైద్యానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీని సీడీ రూపంలో రూపొందించారు దర్శకుడు యమునా కిషోర్. సిద్ధ వైద్యంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన డా. శ్రీమతి సత్య సింధూజ గారి ద్వారా ఈ విశేషాలను ప్రజలకు అందించారు. సిద్ధ వైద్యానికి సంబంధించిన ఈ సీడీ ఆవిష్కరణకు చెన్నై నుంచి ప్రఖ్యాత తార శోభన గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, స్వయంగా ఆవిష్కరించారు. సిద్ధ వైద్యం గొప్పతనం, అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అందులో విపులంగా చర్చించారు. ఈ ఆవిష్కరణ సభలో డాక్యుమెంటరీ దర్శకుడు యమునా కిషోర్, జగదీశ్ కుమార్, భువనగిరి శ్రీనివాసమూర్తి, ఇంకా శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ డాక్యుమెంటరీ ద్వారా సిద్ధ వైద్యం ప్రాముఖ్యతను తెలియజేస్తూ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ని అందరూ చూడాలని దర్శకుడు యమునాక్ కిషోర్ కోరారు. ఇక సీడీని ఆవిష్కరించిన సీనియర్ నటి శోభనకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also : Krishna Vrinda Vihari : నాగశౌర్య చెప్పిన కొత్త లెక్క 2+2= 22!