Site icon NTV Telugu

Salt Vastu: ఉప్పును అక్కడ ఉంచితే మీకు శుభం, ఐశ్వర్యం

Salt 123

Salt 123

మన జీవితంలో ఉప్పుతో ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ భూప్రపంచంలో 70 శాతం నీళ్లు… అందునా ఉప్పునీరే వుంటుంది. ఉప్పును వాస్తుశాస్త్రవేత్తలు ఎంతో ప్రముఖమయిందిగా చెబుతారు. ఇంట్లో కొన్నిప్రాంతాల్లో ఉప్పును ఉంచితే ఎన్నో శుభాలు కలుగుతాయని అంటారు. అందుకే ఉప్పును తొక్కడం గానీ, దొంగతనం కూడా చేయకూడదని, రాత్రి పూట ఉప్పు అనే పదం వాడకూడదంటారు. ఉప్పును చేతితో తీసుకోకూడదని కూడా చెబుతారు. ఎందుకంటే.. ఉప్పును దైవంగా భావిస్తారు పూర్వీకులు. అందుకే.. ఒకరి చేతి నుంచి మరొకరికి ఉప్పును ఇవ్వకూడదు.

Read Also:Bengaluru: ఎయిర్‌పోర్ట్ దూరంగా ఉందని బాంబు బెదిరింపు.. విద్యార్థి అరెస్ట్

అంతేకాదు, ఎవరికీ ఉప్పుని అప్పుగా ఇవ్వకూడదు, శుక్రవారం, మంగళవారం ఉప్పు కొనకూడదంటారు. కూరలను రుచిగా చేసేది ఉప్పే కాబట్టి.. దాన్ని మన పూర్వీకులు శనీశ్వరుడి రూపంగా భావించేవారు. అందుకే ఉప్పును తొక్కడం, ఉప్పు మూటలపై కూర్చోవడం వంటివి దోషమంటారు. ఉప్పు వల్ల చెడు మాత్రమే జరుగుతుందని భావిస్తే అది ముమ్మాటికీ తప్పే ఉప్పు ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది. సముద్రం ఉప్పు (Crystal Salt) ని ఇంటికి తెచ్చి మూత వేసి వుంచుకోవాలి. ఉప్పే మన ఇంట్లో ఉంటే పాజిటివ్​ ఎనర్జీ(positive energy)ని ఇస్తుందని నమ్ముతారు.

ఉప్పును ఒక వస్త్రంలో కట్టి ఇంటి నలుమూలల ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ ఉప్పును చల్లితే మొత్తం నెగటివ్ ఎనర్జీ (negative energy)ని పోతుంది. ఇంటి ముందు బకెట్ లేదా చిన్న పాత్రలో నీరు, ఉప్పు కలిపి ఉంచితే.. అది నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని అంటారు. ఇంటినలుమూలల చిన్న గ్లాసులో (డిస్పోజల్ అయితే మంచిది) ఉప్పు వేసి మూలన ఉంచాలి. ఆ ఉప్పును వారానికి ఒకసారి మార్చాలి. ఆ ఉప్పు గ్లాసుని డ్రైనేజీలో వేయాలి.

అలాగే టాయిలెట్ లో కూడా ఉప్పు ఉంచడం మంచిది. మార్చిన ఉప్పును, ఉప్పు నీటిని శరీరంపై పడకుండా డ్రైనేజీ లేదా టాయిలెట్‌లో పారబోయాలి. అరచేతిలో ఉప్పు వేసుకుని కడిగితే.. డబ్బు వస్తుందంటారు. బాత్‌రూమ్‌లో ఉప్పు పెడితే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు తొలగిపోతాయట. ఇంట్లో వివిధ ప్రాంతాల్లో ఉప్పును ఉంచితే ధనలాభం కలుగుతుందట. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు పిల్లలకు దిష్టి తగిలితే ఉప్పును వాళ్ళ చుట్టూ తిప్పి బయట పడేస్తారు. ఉప్పు, మిరపకాయలు దిష్టి తీస్తారు. మనలో నెగిటివ్ ఎనర్జీని తరిమేయడమే ఆ పని ఉద్దేశం. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కాళ్లను పెట్టాలి. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. నెగటివ్ ఎనర్జీ కూడా దరిచేరదు. మన శరీరంలో మోతాదుకి మించి ఉప్పు ఉంటే అది అనారోగ్యం.. అలాగే ఇంట్లో కూడా. పరిమితంగా ఉప్పును ఇంట్లో ఉంచి మూత వేయాలి. లేదంటే ఉప్పు నీరుగా మారిపోతుంది. ఆర్థిక సమస్యలున్న వారు కూడా ఉప్పుని పరిహారంగా పాటించవచ్చు.

Read Also: Nikhil: హీరో అవ్వడానికి వారికి రూ. 5 లక్షలు ఇచ్చి మోసపోయాను..

Exit mobile version