NTV Telugu Site icon

Kumari Aunty: మీడియాను నేను పిలిచానా.. పోలీసులపై కుమారి ఆంటీ ఫైర్

Kumari Aunty

Kumari Aunty

Kumari Aunty:అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు చెప్తారు. అంటే ఏది అతిగా ఉండకూడదు అని అర్ధం. దానివల్లన ఎంత పేరు వస్తుందో.. అంతే వివాదాలు కూడా వస్తాయి. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహిళ కుమారి ఆంటీ. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ ఎదురుగా ఆమె తన స్ట్రీట్‌ఫుడ్‌ బిజినెస్‌ను స్టార్ట్ చేసి 13 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎక్కువ కావడంతో ఆమె ఫేమస్ అయ్యింది. తక్కువ ధరలో క్వాలిటీ ఫుడ్ పెడుతుందని, టేస్ట్ బావుంటుందని చెప్పడంతో ఒక్కొక్కరుగా కుమారి ఆంటీ బండిదగ్గరకు వెళ్లడం.. వీడియోలు తీసి పెట్టడంతో బిగా గుర్తింపు తెచ్చుకొని చిన్నపాటి సెలబ్రిటీగా మారింది. ఇక ఇప్పుడు అదే చిక్కులు తీసుకొచ్చి పెట్టింది. ఆమె ఫేమస్ అయ్యింది అని.. చాలామంది ప్రజలు అక్కడే ఫుడ్ తినాలని ఆమె ఫుడ్ స్టాల్ వద్ద బారులు తీరారు. ఎంతలా అంటే..అక్కడకు వచ్చిన కస్టమర్లతో ట్రాఫిక్ నిలిచిపోయేలా.. దీంతో పోలీసులు వచ్చి వారిని అదుపుచేయడం మొదలుపెట్టారు.

ఇక కుమారి ఆంటీ రావడమే కస్టమర్లు ఫుడ్ కోసం ఎగబడడంతో పోలీసులు ట్రక్ లో నుంచి ఫుడ్ ను కిందకు దింపనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో కుమారి ఆంటీ పోలీసులపై ఫైర్ అయ్యింది. ” చుట్టూ ఉన్నవారందరూ అమ్ముకుంటున్నారు.. మమ్మల్ని ఒక్కళ్ళే ఎందుకు అమ్ముకోనివ్వడంలేదు. మీ పబ్లిక్ ను మేము రమ్మని పిలిచామా.. ? మీడియాను రమ్మని పిలిచామా.. ? మారేందుకు పోలీసులు మాపై కక్ష కడుతున్నారో అర్ధం కావడం లేదు. రెండు గంటల నుంచి మమ్మల్ని అమ్ముకోనివ్వడం లేదు. అందరు బిజినెస్ చేసుకుంటున్నారు. పోలీసులు గతంలో ట్రాఫిక్ వలన కొంత పబ్లిక్ ను అదుపుచేసినా ఆ తరువాత అమ్ముకోనిచ్చారు. మళ్లీ ఇప్పుడు ఏమైందో మా ఫుడ్ ట్రక్ ను కూడా ఆపేశారు. కోపంగా మాట్లాడుతున్నాను అంటే.. ఇంతమంది ఆకలితో వచ్చారు.. నాకోసం.. నాకేమి అర్ధం కావడంలేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.