Rice vs Chapati: డయాబెటిస్ ఉన్న చాలా మందికి ఒక సందేహం ఉండనే ఉంటుంది. రాత్రి పాడుకొనే సమయంలో రైస్ తినాలా? లేక చపాతీ తినాలా? ఈ రెండింట్లో ఏది బెటర్ అనేది ఒకసారి చూద్దాం.
Radhakumari Success: ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలు.. చరిత్ర సృష్టించిన రాధాకుమారి..
ఒక కప్ రైస్ (అంటే మన చేతి నిండా)లో సుమారు 50 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదే ఒక చపాతీలో మాత్రం సుమారు 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అంతేకాక, చపాతీలో రైస్‌తో పోలిస్తే 2 గ్రాముల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చపాతీ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ అంత త్వరగా పెరగవు. మరోవైపు, రైస్‌లో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది.
Upcoming Mobiles: సెప్టెంబర్ నెలలో రాబోతున్న స్మార్ట్ఫోన్స్ లిస్ట్ ఇదిగో!
క్వాంటిటీ ఇంపార్టెంట్.. ఇక్కడ ముఖ్యమైనది మనం తినే పరిమాణం. రాత్రి వేళలో డయాబెటిస్ ఉన్నవారు ఒక కప్ రైస్ తీసుకోవచ్చు. లేకపోతే రెండు చపాతీలు తీసుకోవచ్చు. కానీ, డయాబెటిక్ పేషెంట్స్ ఒక సమస్య ఎదుర్కొంటారు. చపాతీ అయితే కొలతలో తింటారు. అంటే రెండు చపాతీలు తిని డిన్నర్ ఫినిష్ చేస్తారు. కానీ, రైస్ అయితే కొలత లేకుండా ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. అదే షుగర్ పెరిగే కారణం అవుతుంది. కాబట్టి, డయాబెటిక్ పేషెంట్స్‌కి రాత్రి భోజనానికి రెండు చపాతీలు తినడం ఉత్తమం. రైస్ కూడా తినవచ్చు కానీ పరిమాణాన్ని కచ్చితంగా నియంత్రించాలి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
