Site icon NTV Telugu

Rice Cooker : రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నారా? మీకు షాకింగ్ న్యూస్…

Rice Cooker

Rice Cooker

ఒకప్పుడు కట్టెల పొయ్యిమీద మట్టి కుండల్లో ఎక్కువగా అన్నం వండుకొని తినేవారు. అందుకే అందరు ఎటువంటి రోగాలు లేకుండా చాలా ఆరోగ్యం ఉండేవారు.. రాను రాను టెక్నాలజీ పెరిగిపోవడంతో కుక్కర్ లు అందుబాటులోకి వచ్చాయి.. ఇప్పుడు కరెంట్ రైస్ కుక్కర్ లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రతి ఇంట్లో రైస్ కుక్కర్ ఉంటుంది. అందులో బియ్యం వేస్తే క్షణాల్లో అన్నం అవుతుంది..ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను వినియోగిస్తే గంజిలోని పోషకాలు కూడా శరీరానికి లభిస్తాయని చాలామంది ఫీలవుతారు.. పోషకాలు మాట పక్కన పెడితే ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం..

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు పెద్దగా కరెంట్ కూడా అవసరం లేదు.. అల్యూమినియం పాత్రలను వినియోగించడం వల్ల కొన్నిసార్లు క్యాన్సర్ లాంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నాసిరకం రైస్ కుక్కర్లను వాడితే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండిన ఆహారం తీసుకుంటే చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినడం ద్వారా శరీరానికి పోషకాలు లభించవు. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దని వైద్యులు చెబుతున్నారు.. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వినియోగిస్తే ఉదర సంబంద సమస్యలు, గుండె సంబందిత సమస్యలు, కీళ్ల వాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మట్టి పాత్రల్లో వండుకొని తినడం వల్ల అనేక పోషకాలు శరీరానికి పడతాయని చెబుతున్నారు..

Exit mobile version