ఈరోజుల్లో అందరు బిజీ లైఫ్ ను గడుపుతుంటారు.. తినడానికి కూడా చాలా మందికి టైం ఉండదు.. ఇక చేసేదేమి లేక కొందరు కడుపు మాడ్చుకుంటే.. మరికొందరు మాత్రం రెస్టారెంట్ ఫుడ్ కు అలవాటు పడతారు.. అలా రెస్టారెంట్ లలో ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రెస్టారెంట్ ఫుడ్ లో కొలెస్ట్రాల్ ను పెంచే ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది.. రెస్టారెంట్ ఫుడ్‌లో నూనె, మసాలాలు ఎక్కువగా వాడటం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది..రెస్టారెంట్ ఫుడ్ ఎక్కువగా తింటే అందులో ఉండే కారం కాలేయానికి హాని చేస్తుంది. రెస్టారెంట్ ఫుడ్‌లో ఉప్పు, రసాయనాలను ఎక్కువగా వాడుతారు.. దానివల్ల శరీరంలో విపరీతంగా కొవ్వు కూడా పెరిగిపోతుంది..
మూత్రపిండాలలో రాళ్ల సమస్యకు ప్రధాన కారణాలలో ఒకటి పేలవమైన జీర్ణక్రియ, దీనిలో సరైన ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుంది. రెగ్యులర్ రెస్టారెంట్ ఫుడ్ తినడం వల్ల ఈ సమస్యను ప్రభావితం చేస్తుంది . మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది..
అధికంగా నూనెలు, మసాలాలు ఎక్కువగా ఉండటం వల్ల ఒంట్లో కొవ్వు పెరుగుతుంది.. కీళ్ల నొప్పులతో పాటుగా గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.. అక్కడ ఫుడ్‌లో ఉపయోగించే నూనె, ఇతర అనారోగ్యకరమైన కొవ్వు సమ్మేళనాలు మీ కాలేయానికి హాని చేస్తాయి. ఇది కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. దాని పనితీరును నెమ్మదిస్తుంది. అంతే కాకుండా ఫ్యాటీ లివర్ సమస్య కూడా వస్తుంది.. ఇది క్యాన్సర్ కు కూడా దారీ తీయ్యొచ్చు..
ఇలా రెస్టారెంట్‌లో తినడం వల్ల మీరు మీ పిత్తాశయం దెబ్బతింటుంది. ఎందుకంటే బయటి ఆహారం శరీరంలో పిత్తాన్ని పెంచుతుంది. జీర్ణ ఎంజైమ్‌లను ప్రభావితం చేస్తుంది.. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.. సో అప్పుడప్పుడు ఒకే కానీ ఇలా రోజు తింటే మాత్రం మీ ప్రాణాలు పోవడం పక్కా అని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
