రక్తపోటు (బిపి) అనేది మన ఆరోగ్యంలో కీలకమైన అంశం. ఎందుకంటే, ఇది మన ధమనుల గోడలకు వ్యతిరేకంగా రక్తం యొక్క శక్తిని కొలుస్తుంది. సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన రక్తపోటు 120/80 mmHg ఉంటుంది. అయితే రక్తపోటు ఈ సాధారణ పరిధి నుంచి పక్కకు వెళ్లే సందర్భాలు ఉన్నాయి. ఇది తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్), అధిక రక్తపోటు (హైపెర్టెన్షన్) అని పిలువబడే పరిస్థితులకు దారితీస్తుంది. ఇప్పుడు సడెన్‌గా రక్తపోటు ఎందుకు తగ్గుతుందో తెలుసుకుందాం..
READ MORE: West Bengal: బెంగాల్‌లో మరో రేప్ కేసు.. పొరుగింటి మహిళపై అత్యాచారం, విషమిచ్చి హత్య..
అడ్రినల్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం వల్ల కూడా దీర్ఘకాలంగా రక్తపోటు పడిపోవటానికి అవకాశం ఉంది. అడ్రినల్ గ్రంథి కార్టికో, మినెరలో కార్టికో స్టిరాయిడ్లను ఉత్పత్తి చేస్తుంది. వీటి మోతాదులు తగ్గితే బీపీ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. పరగడుపున కార్టిజాల్ టెస్ట్ చేసుకుంటే.. అడ్రినల్ గ్రంథి పనితీరును తెలుసుకోవచ్చు. శరీరంలో సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాల మోతాదులు తగ్గినా బీపీ పడిపోతుంది.
కొందరిలో పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు రక్తపోటు మామూలుగా లేదా ఎక్కువగా ఉంటుంది. కానీ, లేచి నిల్చున్నప్పుడు రక్తపోటు పడిపోతుంది. ఇలాంటి పరిస్థితికి కారణం స్వయం చాలిత నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడమే. అలాగే ధమనుల్లో పూడికలుంటే ఒక చేతిలో బీపీని పరీక్షిస్తే ఎక్కువగా, మరో చేతిలో పరీక్షిస్తే మామూలుగా ఉండొచ్చు. ఇలా లో-బీపీ రావడానికి వివిధ కారణాలుంటాయని డాక్టర్ ఎన్.కృష్ణారెడ్డి చెబుతున్నారు. అయితే.. ఈ సమస్యతో బాధపడేవారు గుండె నిపుణులను గానీ జనరల్ ఫిజిషియన్‌ను గానీ సంప్రదిస్తే కారణమేంటన్నది పరిశీలిస్తారు. వారి సూచనలకు అనుగుణంగా చికిత్స చేయించుకోవాలి అని కృష్ణారెడ్డి సూచిస్తున్నారు.
READ MORE:Heart attack-Exercise: అలర్ట్.. అధిక వ్యాయామంతో గుండెపోటు..!