Site icon NTV Telugu

Pneumonia in Children: పేరెంట్స్ అలర్ట్.. వర్షాకాలంలో పిల్లలకు న్యుమోనియా ఎఫెక్ట్.. జాగ్రత్త సుమీ!

Pneumonia In Children

Pneumonia In Children

Pneumonia in Children: వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, జ్వరాలు, శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా చిన్నారుల్లో న్యుమోనియా కేసులు ఈ కాలంలో అధికంగా కనిపిస్తాయి. న్యుమోనియా ఒక తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

వర్షాకాలంలో న్యుమోనియా ఎక్కువగా ఎందుకు వస్తుంది?
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వలన బాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. అలాగే చల్లని వాతావరణం కారణంగా పిల్లల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇంకా తడిసి వర్షంలో ఆడుకోవడం, తడి బట్టలతో ఉండటం వల్ల శరీరం చల్లబడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు త్వరగా పట్టేస్తాయి. అలాగే ఇంట్లో గదులు మూసివేసి ఉండటం, గాలి సరిగా ఆడకపోవడం వల్ల వైరస్‌లు ఒకరినుంచి మరొకరికి సులభంగా పాకుతాయి. ఎక్కువ రోజులు తగ్గని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లేదా వేగంగా శ్వాస తీసుకోవడం ఇంకా దగ్గు, కఫం, ఆహారం తినకపోవడం, బలహీనత, పెదవులు, గోర్లు నీలిరంగులోకి మారడం (తీవ్ర స్థితి) వంటివి న్యుమోనియా లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి.

MEGA 157 : మెగాస్టార్ సినిమా టైటిల్ చెప్పేసిన అనిల్ రావిపూడి.. అదిరిందిగా

నివారణ ఎలా?
పిల్లలను వర్షంలో తడవకుండా చూసుకోవాలి. తడిసిన వెంటనే పొడి బట్టలు వేసి వేడి పాలు లేదా సూప్ ఇవ్వాలి. ఇంకా ఇమ్యూనిటీ పెంచే ఆహారం బాగా ఇవ్వాలి. ముఖ్యంగా పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు, పప్పులు ఇవ్వడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇంకా కుదిరితే ముందు జాగ్రత్తగా వాక్సినేషన్ చాలా ముఖ్యం. న్యుమోనియా వ్యాక్సిన్, ఫ్లూ షాట్లు డాక్టర్ సలహా మేరకు వేయించాలి. అలాగే ఇంట్లో గాలి సరిగా ఆడేలా చూడాలి. పిల్లలు ఉండే గదుల్లో తేమ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి.

New York India Day Parade : న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో మెరిసిన టాలీవుడ్ స్టార్ జంట

ఇంకా దగ్గు, జలుబు ఉన్నవారి దగ్గర పిల్లలను దూరంగా ఉంచండి. పిల్లల్లో శ్వాస ఇబ్బందులు గమనించిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. వర్షాకాలం మంచిదే.. కానీ, చిన్నారుల ఆరోగ్యానికి సవాలుగా మారుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ, ముందు జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను న్యుమోనియా వంటి ప్రమాదకర ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు.

Exit mobile version