Site icon NTV Telugu

Plastic Plates Cancer: ప్లాస్టిక్ ప్లేట్‌లో భోజనం చేస్తున్నారా? అయితే డేంజర్‌లో ఉన్నట్లే!

Plastic Plates Cancer

Plastic Plates Cancer

Plastic Plates Cancer: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యుగంలో ప్లాస్టిక్‌ ప్లేట్‌లో ఆహారం తినే ట్రెండ్ విపరీతంగా పెరిగింది. ప్లాస్టిక్ ప్లేట్ అయినా, కప్పు అయినా జనం వాటిలోనే టీ టీతాగడం, టిఫిన్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ విధంగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాలు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ ప్లేట్‌లో తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ ప్లే్ట్‌లో తింటే క్యాన్సర్ ఎలా వస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Koti Deepotsavam Day 12: నేత్ర పర్వంగా “వరంగల్ భద్రకాళీ కల్యాణోత్సవం”..

ప్లాస్టిక్ ప్లేట్‌లో ఆహారం తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా..
ఆంకాలజిస్ట్ డాక్టర్ రోహిత్ కపూర్ అనే వైద్యుడు NCBIలో ప్రచురితమైన పరిశోధనను ప్లాస్టిక్ ప్లేట్‌లో ఆహారం తినడ వల్ల క్యాన్సర్ వస్తుందా అనే దానికి ఉదహరించారు. ప్లాస్టిక్ ప్లేట్స్‌లలో కొద్దిగా వేడిగా ఉండే వంటకాలు ఉంచితే అవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని చెప్పారు. ఎందుకంటే వేడి ఆహారం ప్లాస్టిక్ నుంచి BPA (బిస్ఫినాల్ A), థాలేట్స్ వంటి రసాయనాలను విడుదల చేస్తుందని వెల్లడించారు. ఈ రసాయనాలు మనం తినే ఆహారంతో పాటు శరీరంలోకి ప్రవేశిస్తాయని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ప్లాస్టిక్ ప్లేట్ లేదా ఇతర కంటైనర్‌లో ఎక్కువసేపు వేడి ఆహారాన్ని తీసుకుంటే, ఈ రసాయనాలు హార్మోన్ల అసమతుల్యతలకు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరించారు.

ప్లాస్టిక్‌ ప్లేట్‌లో తినడం మానుకోండి..
ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కంటైనర్‌లో వేడి ఆహారాన్ని తినకుండా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు. అలాగే మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయకూడదని చెబుతున్నారు. ప్లాస్టిక్‌లో ఆహారం తినడం వల్ల క్యాన్సర్ రాకపోయినా, అది ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. చాలా కాలంగా ఇలాంటి ఆహారాన్ని తింటున్న వారిలో ఈ ప్రమాద స్థాయి ఎక్కువగా కనిపిస్తుందని సూచించారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్లాస్టిక్ ప్లేట్‌లలో ఆహారం తీసుకోవడం మానేయాలని వైద్యులు చెబుతున్నారు.

READ ALSO: Cancer Awareness: క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Exit mobile version