NTV Telugu Site icon

Pigeon Droppings: పావురంతో ప్రాణాంతక వ్యాధులు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..

Pigeon Droppings

Pigeon Droppings

Pigeon Droppings: హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా పావురాలే. పావురాలను చూసాయేమో అని వాటి దగ్గరకు వెళితే ఇక అంతే సంగతులు. ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును మీరు విన్నది నిజమే. ఒకప్పుడు సమాచారాన్ని చేరవేసే రాయబారి పాత్ర పోషించే పావురాలు.. ఇప్పుడు అంటు వ్యాధుల ఏజెంట్లుగా మారడం ఆశ్చర్యకరం. పావురాలకు మూత్రాశయం ఉండదు, కాబట్టి వాటి విసర్జన లోనే మల మూత్రాలు ఉంటాయి.

Read also: Social Media Posts: అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత పోస్టులు.. నిందితుడు అరెస్ట్..

వాటి రెట్టల నుండి విసర్జించే సూక్ష్మజీవులు గాలిలో కలిసిపోతాయి. వాటి రెక్కల నుంచి వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఈకల ద్వారా ఏసీలోకి ప్రవేశిస్తున్నాయి. ఆ గాలిని మనం పీల్చడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఈ విషయం తెలియని జనాలు ఆ పావురాలతో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ప్రమాదకరమని భావించని బాల్కనీలు, పైకప్పులపై పావురం రెట్టలు వాస్తవానికి అలెర్జీలకు కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పావురాల వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధి పావురాల డ్రాపింగ్స్. ఇది శ్వాసకోశ వ్యాధులు.. పావురం రెట్టల వల్ల వస్తుంది. తాజాగా టాలీవుడ్ నటి మీనా భర్త విద్యాసాగర్ మృతికి పావురాల ఇన్ఫెక్షన్ కారణమని తమిళ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

Read also: Minister Sridhar Babu: అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ.. కంపెనీ ప్రతినిధులతో శ్రీధర్ బాబు సమావేశం

లక్షణాలు ఏమిటి?

* పావురాల రెట్టల ద్వారా సంక్రమించే వ్యాధి యొక్క లక్షణాలు అలెర్జీ శ్వాసనాళాల ఆస్తమా మాదిరిగానే ఉంటాయి.
* ఈ లక్షణాలు జలుబు, జ్వరంతో మొదలవుతుంది.
* దగ్గు, దగ్గు (ఊపిరితిత్తుల్లో రక్తం) వస్తుంది.
* ఆయాసం విపరీతంగా వస్తుంది.

ముఖ్యంగా రోగనిరోధక శక్తి లేనివారిలో ఇది తీవ్రంగా ఉంటుంది. అనేది తెలియాలంటే కొంత సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అలర్జిక్ బ్రోన్చియల్ ఆస్తమా పావురాల నుండి వస్తుందా? తెలుసుకోవడానికి సమయం పడుతుంది. శ్వాసకోశ వ్యాధులు తీవ్రమై వెంటిలేటర్‌పై ఉంచాల్సి వస్తోంది. రానురాను అంత సీరియస్ అవుతాడు. కాబట్టి పావురాలకు రోగాలు సోకినట్లే ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పావురాల రెట్టలు, ఈకలను తొలగించడం చాలా ముఖ్యం. అలాగే, మీ ఇంటి పరిసరాల్లోకి పావురాలు ప్రవేశించకుండా లేదా గూడు కట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. పావురాలను ఇంట్లోకి రాకుండా నెట్ ఉపయోగించండి. ఇంటి పైకప్పుల పరిసరాలను తరచుగా శుభ్రం చేయండి. శుభ్రపరిచే ముందు చేతి తొడుగులు ధరించండి.. నిర్లక్ష్యం చేయకండి.
Sangareddy: వెల్లివిరిసిన మానవత్వం.. భిక్షాటన చేస్తూ మృతి చెందిన వృద్ధురాలికి దహన సంస్కారం..

Show comments