Site icon NTV Telugu

Pappu Charu: పప్పుచారు ఇలా చేసారంటే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే!

Pappu Charu

Pappu Charu

Pappu Charu: తెలుగు వారి చాలా ఇళ్లలో తినే వంటకాలలో ‘పప్పు చారు’ బాగా ఫేమస్. సాధారణంగా సాంబార్‌కి కొంచెం లైట్ వెర్షన్‌గా, తక్కువ మసాలాలతో తయారయ్యే ఈ పప్పు చారు అన్నంతో కలిపి తినడం ఎంత రుచిగా ఉంటుందో చెప్పక్కర్లేదు. మరి ఈ పప్పు చారును ఇంట్లో ఎలా సులభంగా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అవసరమైన పదార్థాలు:
పప్పు కుక్కర్ కోసం:
* కందిపప్పు – 1 కప్పు

* టమాటో – 1 (ముక్కలుగా కట్ చేయాలి)

* పచ్చి మిరపకాయలు – 4

* పసుపు – 1/2 స్పూన్

* నీరు – అవసరమైనంత
Nitin Gadkari: చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ను కొనియాడిన నితిన్ గడ్కరీ..

చారు కోసం:

* ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)

* టమాటో – 1 (సన్నగా తరిగినది)

* పచ్చిమిరపకాయలు – 2

* ఇంగువ – 1 చిటికెడు.

* చింతపండు – నిమ్మకాయ సైజు (నీటిలో నానబెట్టినది)

* కొద్దిగా కొత్తిమీర

* ఉప్పు – రుచికి తగినంత

* నీరు – 2-3 కప్పులు

పోపు కోసం:

* నెయ్యి లేదా నూనె – 1 టేబుల్ స్పూన్

* ఆవాలు – 1/2 స్పూన్

* మినప్పప్పు – 1/2 స్పూన్

* కరివేపాకు – కొద్దిగా

* ఎండు మిరపకాయలు – 2

* జీలకర్ర – 1/2 స్పూన్

* ఇంగువ – చిటికెడు.
Saina Nehwal: నెల క్రితమే విడాకులు.. శుభవార్త చెప్పిన సైనా నెహ్వాల్!

తయారీ విధానం:
పప్పుచారు కోసం ముందుగా కందిపప్పు ఉడికించాలి. ముందుగా కందిపప్పును కడిగి కుక్కర్‌లో వేసి టమాటో ముక్కలు, పసుపు, పచ్చిమిరపకాయలు వేసి 3 కప్పుల నీరు పోయాలి. అలాగే 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడకనివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఉడికిన పప్పును బాగా మెత్తగా ముద్దగా చేయాలి.

ఆ తర్వాత మరొక పెద్ద పాన్‌లో నెయ్యి లేదా నూనె వేసి పోపు వేసుకోవాలి. అందులోకి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేయించాలి. ఆ తరువాత నానబెట్టిన చింతపండు రసం కలపాలి. నీరు కూడా పోసి మరిగించాలి.

ఆ తర్వాత మెత్తగా ముద్దగా చేసిన పప్పు వేసి కలపాలి. అందులోకి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి మరిగించాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అందులో మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోవచ్చు. ఇంకేముంది మీ ముందర రుచిని ఆస్వాదించడానికి పప్పుచారు రెడీ. ఈ పప్పు చారు వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి కలిపితే ఆ టెస్ట్ వేరబ్బా. పక్కన ఒక్క ఫ్రై ఐటమ్ లేదా అప్పడముంటే చాలు ఒక పండుగ భోజనం రెడీ అంతే. ఇది పిల్లలకీ పెద్దలకూ చాలా నచ్చే సౌకర్యవంతమైన వంటకం.

Exit mobile version