NTV Telugu Site icon

Paper Cups: పేపర్ కప్పుల్లో కాఫీ, టీలు తాగుతున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండె ఆగిపోతుంది..

Paper Cup Of Coffee And Coffee Beans On Wooden Table

Paper Cup Of Coffee And Coffee Beans On Wooden Table

ఏ ఫంక్షన్ జరిగిన పార్టీ జరిగిన కూడా పేపర్ కప్పులు, ప్లేట్లు ఉండాల్సిందే.. అయితే ప్లాస్టిక్ ప్రాణాలకు ప్రమాదం అయితే పేపర్ లో ఉండే కెమికల్స్ కూడా ప్రాణంతకరమైన వ్యాధులను కలిగిస్తాయని నిపుణులు ఒకపక్క చెబుతూనే ఉన్నా కూడా మరో పక్క వచ్చిన వారికి అందులో టిఫిన్స్, టీలు, భోజనాలు, స్నాక్స్, కూల్ డ్రింక్స్, మంచినీళ్ళు ఇక అవి ఇవి అని వడ్డీస్తున్నారు.. ఎందుకంటే ఇంట్లో సామాన్లను తీసి కడిగే అవసరం లేకుండా ఇలా డిస్పోజబుల్ ఉత్పత్తులను వాడుతూ ఉంటాం. అయితే వీటిని వాడేసాకా బయట వేసేస్తూ ఉంటాం. చెత్తలో భాగమైపోయి నేలలో కలిసిపోతాయనే ఆలోచన.. వీటిలో వేడి వేడివి తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ..

ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లో ఉపయోగించే పేపర్‌ను ఉపరితల పూతతో ఉన్న ప్లాస్టిక్ చేతిలో ఉన్న కాఫీ నుండి కాగితాన్ని రక్షిస్తుంది. ఈ రోజుల్లో, ప్లాస్టిక్ ఫిల్మ్ తరచుగా పాలీలాక్టైడ్, PLA, బయోప్లాస్టిక్ రకంతో తయారు చేస్తున్నారు. బయోప్లాస్టిక్‌లు మార్కెట్‌లోని 99 శాతం ప్లాస్టిక్‌ ఉంటుంది.. మామూలు ఫ్యాకేజింగ్ లో మొక్కజొన్న, సరుగుడు, చెరకు నుండి ఉత్పత్తి ని ఎక్కువగా వాడుతున్నారు.. అవి అంత ప్రమాదం కాదు..

ప్లాస్టిక్‌ల కంటే వేగంగా విచ్ఛిన్నమవుతుంది. కానీ బయోప్లాస్టిక్‌లు నేలలోకి, నీటి మీదకు చేసినప్పుడు మాత్రం వెంటనే భూమిలో కలిసే గుణాన్ని కలిగి ఉండటం లేదు. ఈ కప్పులు పర్యావరణానికి చేరుకున్నప్పుడు పూర్తిగా విచ్ఛిన్నం కావు.. ప్లాస్టిక్ ప్రకృతిలో ఇలానే కొనసాగితే మైక్రోప్లాస్టిక్‌లను జంతువులు, మానవులు తినే ప్రమాదం ఉంది. ఇతర ప్లాస్టిక్‌ల మాదిరిగానే. బయోప్లాస్టిక్‌లలో సంప్రదాయ ప్లాస్టిక్‌ల రసాయనాలు ఉంటాయి… ఈ పేపర్, ప్లాస్టిక్ రెండు కూడా ప్రమాదమే.. అందుకే వీటి జోలికి వెళ్లడం తగ్గించడం మంచిది..