Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
- ఉల్లిపాయ కోస్తే కళ్లలో మంట ఎందుకు?
- కన్నీళ్లు తగ్గించే 5 సింపుల్ చిట్కాలు
- ఉల్లిపాయ కోసేటప్పుడు చేయకూడని తప్పులు
- కంటి సమస్య ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంటగదిలో ఉల్లిపాయ లేనిదే ఏ వంటా ముందుకు సాగదు. రకరకాల వంటకాలకు రుచినిచ్చే ఉల్లిపాయను కోయడం మాత్రం ఒక పెద్ద టాస్క్. కోయడం మొదలుపెట్టిన కొద్ది క్షణాల్లోనే కళ్లలో మంటలు పుట్టి, నీళ్లు కారడం ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సాధారణ అనుభవమే. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కంటిని కాపాడుకోవడానికి శరీరం చేసే ఒక సహజ రక్షణ చర్య మాత్రమే. కేవలం కన్నీళ్లు వస్తాయనే భయంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉల్లిపాయల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన పద్ధతులు పాటించడం ద్వారా ఈ సమస్యను ఈజీగా అధిగమించవచ్చు.
అసలు ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి..
ఉల్లిపాయను కట్ చేసినప్పుడు దాని కణాల నుండి ‘సిన్-ప్రొపనేథియల్-ఎస్-ఆక్సైడ్’ అనే ప్రత్యేకమైన వాయువు విడుదలవుతుంది. ఈ గ్యాస్ గాల్లోకి లేచి, మన కళ్లలోని తేమతో (నీటితో) కలిసినప్పుడు కొద్దిపాటి ఆమ్లంలా (యాసిడ్) మారుతుంది. దీనివల్ల కళ్లలో చికాకు పుడుతుంది. కన్ను ఈ పరిస్థితిని ఒక ప్రమాదంగా గుర్తించి, ఆ రసాయనాన్ని బయటకు కడిగేయడం కోసం కన్నీటి గ్రంథులను వేగంగా ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా కళ్ల నుంచి నీళ్లు కరుతాయి.
Also Read
- Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
- Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
కళ్లమంటను నివారించే సులభమైన చిట్కాలు
ఫ్రిజ్‌లో ఉంచండి: ఉల్లిపాయలను కోయడానికి ఒక 15-20 నిమిషాల ముందు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలోని వాయువు ఘాటు తగ్గి, కళ్లమంట రాకుండా ఉంటుంది.
పదునైన కత్తిని వాడండి : ఎల్లప్పుడూ బాగా పదునుగా ఉండే చాకును ఉపయోగించాలి. మొద్దుబారిన కత్తితో కోస్తే ఉల్లిపాయ కణాలు ఎక్కువగా నలిగి, వాయువు మరింత ఎక్కువగా విడుదలవుతుంది.
ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేయండి : వంటగదిలోని చిమ్నీ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆన్ చేయడం ద్వారా ఉల్లిపాయ నుండి వచ్చే గ్యాస్ కళ్ల దాకా రాకుండా వేగంగా బయటకు వెళ్లిపోతుంది.
వేరు భాగాన్ని చివరన కోయండి: ఉల్లిపాయకు కింద ఉండే రూట్ (వేరు) భాగంలోనే కంటి చికాకును కలిగించే సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉల్లిపాయనంతా కోసిన తర్వాత చివరగా ఆ వేరు భాగాన్ని తొలగించాలి.
రక్షణ కళ్లద్దాలు: కంటి చికాకు మరీ ఎక్కువగా ఉంటే ప్రొటెక్టివ్ గ్లాసెస్ (కళ్లద్దాలు) ధరించవచ్చు. కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకునే వారిపై ఈ వాయువు ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది. అయితే, లెన్స్‌లు ఉన్నప్పటికీ ఉల్లిపాయ కోసేటప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.
ఉల్లిపాయలు కోసేటప్పుడు ఈ తప్పులు చేయకండి
ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు పొరపాటున కూడా చేతులతో కళ్లను నలుపకూడదు. చేతులకు ఉల్లిపాయ రసం అంటుకుంటుంది కాబట్టి, కళ్లను తాకే ముందు చేతులను ఖచ్చితంగా శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ ఉల్లిపాయ కోసిన తర్వాత కూడా కంటి మంట కొన్ని గంటల పాటు తగ్గకుండా తీవ్రమైన నొప్పి, కళ్లు ఎర్రబడటం లేదా దృష్టి మసకబారడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే నేత్ర వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి పైన పేర్కొన్న చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ కన్నీళ్ల ఇబ్బంది లేకుండా ఉల్లిపాయలను హ్యాపీగా వంటల్లో వాడుకోండి.
- Tags
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!