NTV Telugu Site icon

రెండో వేవ్‌ స్థాయిలో.. మూడో వేవ్‌ ఉండకపోవచ్చు!

కరోనా మూడో వేవ్‌ సీరియస్ గా ఉండకపోవచ్చు అని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌)కి చెందిన ఓ సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా వ్యాపించే వైరస్ రకం గనక వెలుగులోకి రాకపోతే అంత ప్రమాదమేమీ ఉండదని తెలిపారు. ఆగస్టు చివర్లో మూడో వేవ్ వస్తుందో, రాదో తెలిసిపోతుందన్నారు. అయితే వ్యాక్సిన్‌ వేసుకోవడం, భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం అసలైన సవాళ్లు అని పేర్కొన్నాడు. ప్రస్తుత జాగ్రత్తల పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండో వేవ్‌ స్థాయిలో కేసులు రాకపోవచ్చునని.. తొలి వేవ్‌ను తలపించొచ్చని పేర్కొన్నారు. గతంలో ప్రబలిన మహమ్మారి వైరస్ లను పరిశీలిస్తే.. వాటి తదుపరి వేరియంట్లతో ఇన్ఫెక్షన్‌ తీవ్రత పెద్దగా ఉండదని తేలిపోయిందన్నారు. ఇప్పుడు కరోనా వైరస్‌ కూడా దాదాపు అదే మాదిరిగా బలహీనపడొచ్చునని తెలిపారు.