NTV Telugu Site icon

Precautions in workouts: వేసవిలో హెవీ వర్కవుట్స్ వద్దు..

Guym10

Guym10

వేసవిలో వేడికి త్వరగా అలసిపోతాం. ఆరోగ్యం, శరీర ధృఢత్వాన్ని పెంచుకునేందుకు కొందరు జిమ్ కు వెళ్లి కసరత్తు చేస్తుంటారు. తమ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాచేయడం మంచిదే కానీ.. అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాకపోవచ్చు. అన్ని సీజన్లలో ఒకే రకమైన కసరత్తు చేయలేమని ఫిట్ నెస్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వేసవిలో హెవీ వర్కవుట్స్ చేసే వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఆ జాగ్రత్తలు ఏమిటో చూద్దామా.. వేసవిలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. హీట్ వెదర్ కారణంగా శరీరం నుంచి చెమట ఎక్కువగా వస్తుంది. వర్క్ అవుట్స్ చేసేటప్పుడు త్వరగా అలసిపోతాం. మిగితా సీజన్లలో చేసినట్లు వేసవిలో కూడా అదే స్థాయిలో చేయడం సరికాదు. దీని వల్ల తీవ్ర అలసటకు గురై డీహైడ్రేషన్ బారిన పడవచ్చు. మరి కొందరిలో కండరాల నొప్పులు, జ్వరం వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో వర్క్ అవుట్లు తగ్గించుకోవడం మంచింది.

READ MORE: T. Padma Rao Goud: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పద్మారావు గౌడ్..

ఎండా కాలంలో చల్లటి పానీయాలు తాగుతుంటారు. వాటిని తాగుతూ.. కసరత్తు చేయడం వల్ల త్వరగా అలసిపోతారు. పైగా ఎనర్జీ డ్రింక్స్ వల్ల శక్తి రాకపోవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వేసవిలో కసరత్తు చేసే వాళ్లు కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింకులకు దూరంగా ఉండాలి. విరామం లేకుండా వర్కవుట్స్ చేయడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. 40-50 నిమిషాల తర్వాత తప్పకుండా పది నిమిషాలైనా విరామం తీసుకోవాలి. వేసవిలో విరామం తీసుకోకుండా వర్క్ అవుట్స్ కొనసాగిస్తే.. ప్రమాదం. ముఖ్యంగా ఎండాకాలంలో అందరూ తప్పకుండా తరచూ నీరు తాగుతూ ఉండాలి. వర్కవుట్ చేసే వాళ్లు మాత్రం వెంట వెంటనే నీళ్లు తాగరాదు. వర్కవుట్స్ తర్వాత కొంత సేపు రెస్ట్ తీసుకుని నీరు తాగడం మంచింది. శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సక్రమంగా ఉండాలంటే తగినంత నీరు తాగాలి. అన్ని సీజన్ల కంటే వేసవిలో చాలా జాగ్రత్తలు పాటించాలి.