Nidhhi Agerwal: సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అందాల భామ నిధి అగర్వాల్, తాజాగా తన హెయిర్ కేర్ రొటీన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తన జుట్టు ఆరోగ్యం విషయంలో తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పిన ఈ బ్యూటీ, ఇంట్లోనే ప్రత్యేకంగా హెల్తీ లడ్డూలు తయారు చేసుకుని తింటున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిధి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హోమ్మేడ్ హెల్తీ లడ్డూల ఫొటోను షేర్ చేస్తూ, వీటిని తయారు చేసుకోవడం చాలా సులభమని తెలిపింది. డ్రై ఫ్రూట్స్, వివిధ రకాల గింజలు, ఖర్జూరం వంటి పోషకాలు ఉండే ఇలాంటి లడ్డూలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జుట్టుకు అవసరమైన బయోటిన్, ఐరన్ వంటి పోషకాలు సహజంగానే అందుతాయని అభిప్రాయపడింది. హెయిర్ కేర్ విషయంలో తాను చాలా సీరియస్‌గా ఉంటానని, అందుకే ఇలాంటి పోషకాహారాన్ని నిత్యం తీసుకుంటానని చెప్పింది.
అంతేకాదు, తన ఫాలోవర్లకు కూడా ఈ ఐడియా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే బయట ఉపయోగించే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌తో పాటు లోపలి నుంచి సరైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో నిధి పోస్ట్ మరోసారి స్పష్టం చేస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే, ‘ది రాజా సాబ్’ తర్వాత ప్రస్తుతం ఓ మైథలాజికల్ థ్రిల్లర్‌తో పాటు ‘అర్జున్ నాగ’ వంటి వరుస ప్రాజెక్టులతో ఈ ముద్దుగుమ్మ తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉంది. మరి ఈ సినిమాలతోనైనా నిధి అగర్వాల్ ఖాతాలో భారీ హిట్ పడుతుందేమో చూడాలి.

