Nail Health Signs: మీ గోర్లు ఏ రంగులో ఉన్నాయో చెప్పండి.. వాటిని బట్టి మీకు వచ్చిన లేదా.. వచ్చే రోగాలు చెప్పవచ్చని అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఎప్పుడైనా ఆలోచించరా.. గోర్ల రంగులను బట్టి రోగాలను నిర్థారించవచ్చని.. అలా వచ్చే రోగాలను ఈ టిప్స్ పాటించి నయం చేసుకోవచ్చని అంటున్నారు. మన శరీరంలో కాల్షియం పోషించే కీలక పాత్ర గురించి మీకు ఐడియా ఉందా.. ఈ కాల్షియం ఎముకల ఆరోగ్యానికి, కండరాల పనితీరులో కీ రోల్ పోషిస్తుందని అంటున్నారు నిపుణులు. కాల్షియం లోపానికి గోర్లు తెల్ల రంగులోకి మారడానికి ఏమైనా సంబంధం ఉందా.. ఉంటే ఆ సంబంధం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Imtiaz Ali: చిన్నతనంలోనే ఋగ్వేదం, భగవద్గీత చదివిన ముస్లిం దర్శకుడు.. ఇప్పటికీ…
కాల్షియం లోపిస్తుంటే సంకేతాలు అందుతాయ్..
మానవ శరీరంలో అత్యంత సమృద్ధిగా లభించేది కాల్షియం. ఇక్కడ విశేషం ఏమిటంటే దీనిని మన శరీరం తయారు చేసుకోలేదు, ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. పొరపాటున మన శరీరంలో కాల్షియం స్థాయిలు తక్కువ అయితే పెద్ద డెంజర్‌లో పడతాం. కాల్షియం లోపంతో ఎముకలు బలహీనవ్వడంతో పాటు పుటుక్కున విరిగిపోతాయని అంటున్నారు వైద్య నిపుణులు. తొలి దశలోనే కాల్షియం లోపాన్ని గుర్తించడానికి శరీరం కొన్ని సృష్టమైన సంకేతాలని ఇస్తుందంటున్నారు నిపుణులు.
మన శరీరంలో కాల్షియం లోపిస్తే వచ్చే జబ్బుల లీస్ట్ మామూలుగా లేదు. వాటిలో కొన్ని ఛాతీ నొప్పి, మూర్ఛపోవడం, చేతులు, కాలి వేళ్ళలో తిమ్మిరి, మింగడానికి ఇబ్బందిగా ఉండటం, జలదరింపు అనుభూతులు, కండరాల తిమ్మిరి, గుండె దడ, క్రమరహిత హృదయ స్పందన రేటు, గోర్లు పెళుసుగా ఉండటం, స్వరపేటిక సంకోచం కారణంగా గొంతులో మార్పులు, అలసట, చిరాకు, నిరాశ, ఆందోళన, గరుకుగా ఉండే జుట్టు, సోరియాసిస్, శ్వాసలో గురక, చర్మం పొడిబారడం, దీర్ఘకాలిక దురద, కండరాల బలహీనత, కంటిశుక్లం, దంతాలు బలహీనంగా ఉండటం, చిగుళ్లులో ఇబ్బందిగా ఉండటం, దంత క్షయం రావడం వంటివి శరీరంలో కాల్షియం లోపిస్తున్నట్లు తెలిపే సంకేతాలు అని అంటున్నారు.
ఏంటి దాని ప్రాముఖ్యత : National Institutes of Health అధ్యయనంలో.. ఎముకలు, దంతాల నిర్మాణంలో కాల్షియం ఎక్కువ భాగాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. కణాల పనితీరు, నరాల సంకేతాల ప్రసారం, హార్మోన్ల స్రావం, రక్త గడ్డకట్టడం, కండరాల సంకోచం, కండరాల సడలింపునకు కాల్షియం తప్పనిసరంటున్నారు నిపుణులు. అంతేకాకుండా కణజాలాన్ని దృఢంగా, బలంగా, సరళంగా ఉంచడం ద్వారా సాధారణ శారీరక కదలికను అనుమతిస్తుందని తెలిపింది. శరీరానికి తగిన కాల్షియం అందకపోవడానికి మన రోజువారీ ఉరుకుల పరుగుల జీవితాలు, జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు కారణమని చెబుతున్నారు. తగినంత కాల్షియం తీసుకునేవారికి కొలోరెక్టల్ అడెనోమాస్, ఒక రకమైన నాన్-క్యాన్సర్ కణితి వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మన దేశంలో చాలామంది రోజుకు సగటున 300 mg కాల్షియాన్ని మాత్రమే వినియోగిస్తున్నారని పలు నివేదికల్లో వెల్లడైంది. వాస్తవానికి 19 నుంచి 64 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు రోజుకు 700mg కాల్షియం అవసరమని nhs.uk అధ్యయనంలో పేర్కొంది. అలాగే, గర్భిణీలు సరిపడా కాల్షియం తీసుకుంటే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
లోపాన్ని నివారించడం : కాల్షియం లోపాన్ని నివారించడానికి సులభమైన మార్గం.. అది ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అంటున్నారు నిపుణులు. అలాగే శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన శరీర బరువును నిర్వహించడం కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు కాల్షియం లోపంతో బాధపడుతుంటే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించడం మంచిదంటున్నారు.
కాల్షియం లభించే ఆహారాలు: ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, వింటర్ స్క్వాష్, పెరుగు, కాల్షియం-ఫోర్టిఫైడ్ నారింజ రసం, సోయాబీన్స్, డబ్బాలో ఉంచిన సార్డినెస్, సాల్మన్ (ఎముకలతో), బాదం వంటి ఆహారాలతో కాల్షియం ఎక్కువగా లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
READ ALSO: Bathukamma Festival: రేపటి నుంచి బతుకమ్మ సందడి.. అసలు బతుకమ్మ కథ ఏంటో తెలుసా!
