NTV Telugu Site icon

Mutton Pulao : మటన్ పులావ్ ను ఇలా చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో..

Mutton Dum Pulav

Mutton Dum Pulav

మటన్.. ఈ పేరు వినగానే చాలా మందికి నోరు ఊరుతుంది కదూ.. చికెన్ కన్నా ఎక్కువగా మటన్ లో పోషకాలు ఉండటంతో మటన్ తో చేసే ఐటమ్స్ కు డిమాండ్ ఎక్కువే.. బయటకు వెళ్లి వందలకు వందలు ఖర్చు పెట్టడం కన్నా ఇంట్లో చేసుకొని తింటే డబ్బు సేవ్ అవుతుంది.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.. ఇక ఈరోజు మటన్ తో పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు..

బాస్మతీ బియ్యం – 800 గ్రా.,

సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 3, పచ్చిమిర్చి – 5,

నూనె – 4 టేబుల్ స్పూన్స్,

నెయ్యి – ఒక టేబుల్ స్పూన్స్,

బిర్యానీ ఆకులు – 2,

దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క,

యాలకులు – 3,

జాప్రతి – 1,

లవంగాలు – 4,

అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టేబుల్ స్పూన్,

తరిగిన టమాటాలు – 3,

పసుపు – పావు టీస్పూన్,

కాశ్మీరి చిల్లీ కారం – ఒక టీ స్పూన్,

వేడి నీళ్లు – 2 లీటర్లు,

తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్,

తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్,

ఉప్పు – తగినంత..

తయారీ విధానం :

ముందుగా మటన్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలో వేసి శుభ్రం చెయ్యాలి..ఇందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. మసాలా దినుసులు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా రంగు మారగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి..తర్వాత ముక్కలను వేసి, టమోటా, కారం వేసి బాగా వేయించాలి..గ్లాస్ నీళ్లు పోసి కలిపి పెద్ద మంటపై పది నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వేడి నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి 40 నుండి 45 నిమిషాల పాటు పెద్ద మంటపై మటన్ 90 శాతం ఉడికే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తరువాత ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు చొప్పున వేడి నీటిని పోయాలి. తరువాత తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు నానబెట్టుకన్న బియ్యాన్ని వడకట్టి వేసుకోవాలి. బియ్యం పొంగు వచ్చే వరకు మంటను హై లో ఉంచి తర్వాత సిమ్ లో పెట్టాలి..అంతా కలిసేలా కలుపుకుని గిన్నెను సిల్వర్ ఫాయిల్ పేపర్ తో మూసివేసి మూత పెట్టాలి. ఇది అందుబాటులోలేని వారు గోధుమపిండిని గిన్నె అంచుల చుట్టూ ఉంచి మూత పెట్టాలి. ఇప్పుడు మంటను చిన్నగా చేసి 12 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి… అంతే సింపుల్ గా ఉండే మటన్ పులావ్ రెడీ అయ్యినట్లే.. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే మీరు ట్రై చెయ్యండి..