Mrunal Thakur: సినిమా తారలు ఎల్లప్పుడూ వారి చర్మం, ఫిట్‌నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొందరి ముఖాలు మేకప్ లేకుండానే మెరిసిపోతుంటాయి. సీతారామం నటి మృణాల్ ఠాకూర్ కూడా తన మెరిసే చర్మానికి ప్రసిద్ధి చెందింది. ఆమె తరచుగా సోషల్ మీడియాలో మేకప్ లేకుండా ఫోటోలను పంచుకుంటుంది. ఇటీవల.. ఒక ఇన్‌స్టా రీల్‌లో మృణాల్ రాత్రి పడుకునే ముందు తాను ఒక ప్రత్యేక నూనెను ఉపయోగిస్తానని చెప్పింది. తన తల్లి దాన్ని సజెస్ చేసినట్లు వెల్లడించింది. ఆ రీల్ లో ఆ నూనెను ముఖానికి రాసుకుంటూ.. మృణాల్ తన తల్లిని దాని ప్రయోజనాలను చెప్పమని అడుగుతుంది. ఆ నూనె చర్మానికి మెరుపును తీసుకురావడంలో సహాయపడుతుందని చెబుతుంది.
READ MORE: Sony Liv : 2025లో అదిరిపోయే కంటెంట్ రెడీ చేసిన ‘సోనీ లివ్’
ఆ నూనె మరేదో కాదు… అది బాదం నూనె. ఈ నూనె శరీరానికి కాకుండా చర్మానికి కూడా మెరుపును తెస్తుంది. ఇందులో విటమిన్ E, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బాదం నూనెను పూయడం వల్ల చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్ లభిస్తుంది. ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. త్వరగా వృద్ధాప్యాన్ని దరి చేరనివ్వదు.
అంతే కాకుండా.. కళ్ళ కింద సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మచ్చలు, నల్లటి వలయాలు, ఉబ్చిన చర్మం నార్మల్ గా మారతాయి.
READ MORE: Health Tips: వేరుశెనగలు, ఆవాలు, నువ్వులు.. ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?
