Site icon NTV Telugu

Mother’s Day 2025: అలుపెరుగని శ్రమజీవి అమ్మకు.. స్పెషల్‌ విష్..!

Mathers Day

Mathers Day

కల్మషం లేని ప్రేమకు ప్రతి రూపం అమ్మ.. అలాంటి అమ్మ కూ ఓ ప్రత్యేకమైన రోజు ఉండటం విశేషం. యునైటెడ్ స్టేట్స్, కెనడా, భారతదేశం తో సహా అనేక దేశాలలో ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం నాడు మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది మే 11 న వచ్చింది. అంటే నేడే. 1908లో అమెరికన్ కార్యకర్త అన్నా జార్విస్ తన తల్లి దాతృత్వ ప్రయత్నాల నుంచి ప్రేరణ పొంది, మొదటి మదర్స్ డే వేడుకను నిర్వహించాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రారంభమైంది. తల్లుల అపారమైన ప్రేమ, బలం, త్యాగాని ప్రతికగా మధర్స్‌ డే ఒక ప్రత్యేక సందర్భంగా మారింది. కానీ నేటి సమాజం చాలా మారింది. ఇంట్లో ఉండాల్సిన తల్లిదండ్రులు రోడ్డు మీద ఉంటున్నారు.

Also Read : Mrunal Thakur : ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేను..

కాయ కష్టం చేసి పెంచి పోషించి ఒక స్థాయికి తీసుకొచ్చి ..  ఒక ఇంటి వాడిని చేసినందుకు .. రుణం తీర్చుకోక పోగా ఇంటి నుంచి బయటకు గెంటెస్తున్నారు. ఇంకొంత మంది వృద్ధాశ్రమంలో ఉంచి నెలకు కొంత డబ్బును పంపిస్తున్నారు. వారి ఇంట్లో వారికే చోటు లేకుండా చేస్తున్నారు. ఇందుకు కారణం కోడుకులు, కోడలు, కూతుర్లు, అల్లుళ్లు అని చెప్పలేం. ఎందుకంటే ఒక్కో ఇంటి కథ ఒక్కోలా ఉంటుంది. ఎలా ఉన్నప్పటికీ అమ్మని రోడ్డున పడేసిన వాడు మట్టిగొట్టుకు పోవడం మాత్రం తథ్యం. తల్లిని నిరాదరణకు గురి చేస్తున్న పిల్లలపై, ప్రతి తల్లి అంతులేని ప్రేమను కనబరుస్తుంది. బిడ్డ పుట్టినప్పటినుంచి పెరిగి పెద్దయ్యే వరకు మాత్రమే కాదు, వాళ్లకు పెళ్లిళ్ళు, వాళ్ల పిల్లలు పెద్ద వాళ్ళు అవుతున్న సరే తల్లికి తమ పిల్లలు ఇంకా చిన్నపిల్లలుగా కనపడతారు..

బ్రతికున్నంత కాలం వాళ్ళ మీద పరిపూర్ణమైన ప్రేమను చూపించేది తల్లి మాత్రమే. బిడ్డలకు చిన్న కష్టం వచ్చిందన్నా సరే తల్లి అల్లాడి పోతుంది. అటువంటి తల్లిని ఈరోజు చాలామంది నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. అమ్మ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మదర్స్ డే వంటి రోజులు వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు.. ప్రతి రోజు అమ్మ పట్ల కాస్తంత ప్రేమ చూపిస్తే చాలు ఆమె ఎంతో సంతోషపడి పోతుంది. తిన్నావా అమ్మ.. అనే ఒక్క పలకరింపు చాలు.. ఆ తల్లి ఆనందానికి అవదులు ఉండవు. ముఖ్యంగా వయసు మీద పడిన తర్వాత ప్రతి తల్లి పిల్లల నుంచి కోరుకునేది కూడా కాస్త ప్రేమ. ఆ ప్రేమను అందించగలిగితే చాలు.

జీవితంలో ఎంతో సాధించాం.. ఎంతో ఎదిగామని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర చాలా విలువైనది. పిల్లల విజయంలో తల్లి నిస్వార్థమైన సేవ చేస్తుంది. అటువంటి అమ్మను ఒక్క మదర్స్ డే రోజు మాత్రమే కాదు.. ప్రతిరోజు ప్రేమగానే చూడాలి. వారు చేతకాని వారు అయ్యారంటే.. వారి శ్రమకు ఫలితం నీ విజయం అని గుర్తు పెట్టుకో.. ఈ కాలంలో కుటుంబంతో గడిపేంత సమయం లేక పోవచ్చు కానీ.. పోయింది ఎలాంటిదైనా ఏదో ఓ రూపంలో దక్కుతుంది. కానీ అమ్మ ప్రేమ మాత్రం దక్కదు ఇదోకటి గుర్తుపెట్టుకోండి. మనం పుట్టినప్పుడు అమ్మ కళ్ళలో ఎంత ఆనందం  ఉంటుందో.. తిరిగి వేళ్లే క్షణం కూడా అంతే ఆనందం మనం ఇవ్వాలి.. అప్పుడే మన జన్మకు ఒక అర్థం పరమర్థం దొరుకుతుంది..

Exit mobile version