Site icon NTV Telugu

Health Tips: ఉదయాన్నే గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ పాలో అవ్వండి

Untitled Design (7)

Untitled Design (7)

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో గ్యాస్ సమస్య ఎక్కువవుతోంది. అయితే ఉదయం నిద్ర లేవగానే కడుపులో మంట, ఉబ్బరం, బరువుగా ఉండడం, త్రేన్పులు ఎక్కువగా రావటం జరుగుతుంటాయి. అయితే మన ఇంట్లో వాడే వంట సామాగ్రితోనే.. వీటినే తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Read Also: Health Tips: ఉదయాన్నే గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ పాలో అవ్వండి

ఈరోజుల్లో గ్యాస్ ప్రాబ్లెమ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. రాత్రా సమయంలో ఏమి తినకపోవడం, కారం, ఆయిల్ పుడ్స్ ఎక్కువగా తీసుకోవడం.. నిద్ర సరిగా లేకపోవడం వంటివి గ్యాస్ రావడానికి కారణాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఇంట్లో వాట్ చిన్న చిన్న ఫుడ్ ఐటెమ్స్ తోనే వీటిని తగ్గించుకోవచ్చని నిపుణులు తెలిపారు.

Read Also: Murder Attempt: దారుణం.. ట్రాక్టర్ లైట్ దొంగింలించాడని.. 14 ఏళ్ల బాలుడిపై ..

ఉదయం లేవగానే.. పడగడపున ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిలో కొద్దిగా క్యారమ్ గింజలు లేదా జీలకర్ర కలిపి తాగడంతో గ్యాస్, ఉబ్బరం తగ్గించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. తరచుగా గ్యాస్‌తో బాధపడేవారు దీనిని తమ రోజువారి దిన చర్యగా మార్చుకుంటే.. గ్యాస్ తగ్గించుకోవచ్చుంటున్నారు. ఇది త్వరగా గ్యాస్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. కడుపు తేలికగా అనిపిస్తుంది. రోజంతా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయం పూట ఐదు నిమిషాలు లోతైన శ్వాస తీసుకోవడాన్ని.. అనులోమ్-విలోమ్‌ అంటారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. కడుపులో ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఉదయాన్నే నానబెట్టిన బాదం, అరటి పండు తినడంతో గ్యాస్ తగ్గించుకోవచ్చంటున్నారు. అయితే ఈ విషయాలన్ని మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వాలనుకుంటే .. ఒక సారి హెల్త్ ఎక్సపర్ట్స్ ని కలిసి సలహా తీసుకోవడం మంచిది.

Exit mobile version