సూపర్ ఫుడ్: మునగాకుతో 300 వ్యాధులు దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రుచిలోనూ, పోషకాలను అందించడంలోనూ మునగాకు చాలా విశిష్టమయింది. మన పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనేది సామెత. మన చుట్టూ వున్న అనేక ఆకుకూరలు, కాయగూరలు అద్భుత ఔషధాలు. కానీ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. మునగచెట్టు అంటే కేవలం మునగకాడలే వాడాలని అంతా అనుకుంటారు. వాటికంటే మునగాకులోనే పోషకాలు ఎక్కువగా వుంటాయి. మనం రోజూ తినే ఆహార పదార్థాలు, కూరగాయలతో ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. మునగాకుతో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
ఫాస్ట్, జంక్ ఫుడ్‌కి యువత అలవాటు పడి కూరగాయలు, ఆకుకూరలను తినడం మానేయడంతో అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఎన్నో పోషకాలు, విటమిన్లు అందించే కూరగాయలు, ఆకుకూరలను చాలామంది తినడం లేదు. వెజిటేరియన్స్ మునక్కాయలు బాగా తింటూ ఉంటారు.
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
చాలామంది ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు. మునక్కాయల్లో ఎ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యం అందించే ఎన్నో పోషకాలు వీటిలో వుంటాయి. అయితే మునక్కాయలే కాదు మునగాకు తినడం ద్వారా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 వ్యాధులకు చెక్ పెట్టే విటమిన్లు, పోషకాలు ఇందులో వున్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు. కానీ ఇది నిజం.
మునగాకులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి. అందుకే మునగాకును ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యులు మునగాకు తినమని చెబుతున్నారు. క్యారెట్లు తినడం ద్వారా వచ్చే విటమిన్లు మునగాకు తినడం వల్ల అధికంగా వస్తాయట. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకు వాడతారట. మునగాకు తింటే నేత్ర సంబంధమయిన ఇబ్బందులు తొలగడమే కాదు. కంటి చూపులో మెరుగుదల కనిపిస్తుంది.
మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. థైరాయిడ్, ఎముకలను బలంగా చేయడంలో మునగాకు ఉపయోగపడుతుంది. మహిళలకు వచ్చే రుతు సంబంధిత ఇబ్బందులకు మునగాకు మంచి మందు. మునగాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగితే ఉబ్బసానికి, అజీర్తి దూరమవుతుంది.మునగాకుని పొడిగా చేసుకుని ప్రతిరోజూ భోజనానికి ముందు రెండు ముద్దలు తింటే మూత్ర పిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంత వరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి, దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాసుకుంటే తగ్గుతాయి.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!