Site icon NTV Telugu

Moringa Leaf: మునగ ఆకులను నీటిలో మరిగించి తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా!

Moringa Leaf

Moringa Leaf

Moringa Leaf: నేటి ఆధునిక ప్రపంచంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య బరువు పెరగడం. దీని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలానే చాలా మంది స్లిమ్ గా, ఫిట్ గా ఉండటానికి జిమ్‌లో గంటల తరబడి గడుపుతారు, కానీ అందరూ స్లిమ్‌గా, ఫిట్‌ కాలేరు. ఈ స్టోరీలో మనం బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని సహజ మార్గాలను తెలుసుకుందాం. అలాగే మునగ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. మునగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మునగలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని, ఇవి శరీరంలో విషాన్ని తొలగించడానికి, జీవక్రియను పెంచడానికి, అదనపు కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయని చెబుతుంది.

READ ALSO: India’s Squad: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. వైస్ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్!

మునగ నీటిని ఎలా తయారు చేయాలంటే..
మునగ నీటిని తయారు చేయడానికి, ఒక టీస్పూన్ మునగ పొడి లేదా కొన్ని తాజా ఆకులను ఒక గ్లాసు నీటిలో మరిగించి, అవసరమైతే అందులో నిమ్మరసం, తేనె వేసి, వేడి చేసి తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

మునగ నీటితో ప్రయోజనాలు ఇవే..
1. బరువు తగ్గడం: మునగ ఆకులు శరీర జీవక్రియను వేగవంతం చేస్తాయి. అలాగే ఇవి ఆహారం త్వరగా జీర్ణమై శక్తిగా మార్చడంలో సహాయం చేస్తుంది. మునగ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర కేలరీలను బర్న్ చేసే సామర్థ్యం పెరుగుతుంది, అలాగే క్రమంగా బొడ్డు చుట్టు పెరిగిన కొవ్వు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

2. మలబద్ధకం: మునగలో సహజంగా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది, అలాగే ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ సార్లు తినాలనే కోరికను నివారించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ, పేగు ఆరోగ్యానికి ఫైబర్ అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుందని, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుందని చెబుతున్నారు.

3. శరీర నిర్విషీకరణ: తరచుగా శరీరంలో అదనపు నీరు, విషపదార్థాలు పేరుకుపోవడం వల్ల అది బరువుగా, వాపుగా కనిపిస్తుంది. సహజంగా మునగ శరీరం నుంచి నీరు, విషపదార్థాలను తొలగించడానికి విశేషంగా సహాయపడుతుందని చెబుతున్నారు. ఇది వాపును తగ్గించడమే కాకుండా శరీరాన్ని తేలికగా, తాజాగా ఉంచుతుందని వెల్లడించారు.

4. చక్కెర స్థాయి: బరువు పెరగడం అనేది తరచుగా చక్కెర సమస్యలతో ముడిపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మునగ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారిలో తీపి తినాలనే కోరికలను తగ్గించడానికి ఇది చాలా ప్రయోజనకరంగా పని చేస్తుందని చెప్పారు.

5. బలహీనత: బరువు తగ్గే సమయంలో చాలా మందికి తరచుగా బలహీనత అనుభూతి కలుగుతుందని, ఎందుకంటే కేలరీలు తగ్గుతాయి కాబట్టి శరీరం అలసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మునగలో పాల కంటే ఎక్కువ కాల్షియం, నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటాయని, ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయని పేర్కొన్నారు. దీనిని తీసుకోవడం వల్ల మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారని, అలాగే అలసట అనుభూతి తగ్గుతుందని చెప్పారు.

READ ALSO: Hardik Pandya: పాండ్య పవర్ హిట్టింగ్ చూశారా!

Exit mobile version