NTV Telugu Site icon

Mint Leaves Benfits: పుదీనా ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ సమస్యతో బాధపడుతున్న వారు తప్పక తీసుకోవాలి!

Mint Leaves

Mint Leaves

Mint Leaves Benefits For Health: వేసవి కాలంలో ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు చల్లటి పదార్థాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దోసకాయ, ఐస్ క్రీం, చల్లని నీరు వంటి వాటన్నింటినీ ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. వేసవిలో పుదీనా ఆకులను కూడా తీసుకోవచ్చు. పుదీనా ఆకులు శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. పుదీనా ఆకులను ఆహారంలో కలపడం వల్ల రుచి కూడా పెరుగుతుంది. పుదీనా ఆకులను పలు రకాల కూరగాయలలో వేసుకోవచ్చన్న విషయం తెలిసిందే.

పుదీనా ఆకులు రుచిగా ఉండడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. పుదీనాలో విటమిన్‌-సి, ప్రొటీన్‌, మెంథాల్‌, విటమిన్‌-ఎ, కాపర్‌, కార్బోహైడ్రేట్స్‌ వంటి పోషకాలు చాలా ఉంటాయి. వాస్తవానికి వేసవిలో ప్రజలు తరచుగా వాంతులు, గ్యాస్, తలనొప్పి మొదలైన సమస్యలతో బాధపడుతుంటారు. ఈ పరిస్థితిలో పుదీనా ఆకులు మీకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. పుదీనా ఆకులతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తలనొప్పి:
పుదీనా ఆకుల్లో తల నొప్పిని తగ్గించే గుణాలు ఉంటాయి. తరచుగా ప్రజలు వేసవిలో తల నొప్పికి గురవుతారు. మండుటెండలో బయటకు వచ్చినప్పుడు.. తలలో భయంకరమైన నొప్పి అనుభూతి కలుగుతుంది. ఈ పరిస్థితిలో మీరు తాజా పుదీనా ఆకులను తీసుకోవచ్చు. ఈ ఆకులు తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మీకు సహాయపడతాయి. పుదీనా నూనె లేదా పుదీనా బామ్‌తో తలకు మసాజ్ కూడా చేసుకోవచ్చు.

Also Read: ODI World Cup 2023: అహ్మదాబాద్‌ పిచ్‌ ఏమైనా నిప్పులు కురిపిస్తుందా.. పీసీబీపై మండిపడిన షాహిద్ అఫ్రిది!

జీర్ణ వ్యవస్థ:
వేసవిలో ప్రజలకు తరచుగా కడుపు సమస్యలు వస్తాయి. అందుకు మీరు పుదీనా ఆకులను ఉపయోగించవచ్చు. పుదీనా జీర్ణ సమస్యలకు సహజ నివారణగా ఉపయోగపడుతుంది. ఇది క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంది. అజీర్ణం నుండి ఉపశమనం పొందడంలో పుదీనా సహాయపడుతుంది. మీరు పుదీనా నీరు కూడా త్రాగవచ్చు. ఇది కడుపు సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి:
పుదీనా ఆకులు బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పని చేస్తాయి. ముఖ్యంగా స్థూలకాయ సమస్య ఉన్నవారికి. ఇందుకోసం మీరు పుదీనా ఆకులను పానీయంగా చేయవచ్చు. కావాలంటే అందులో నిమ్మరసం, ఎండుమిర్చి పొడిని కలుపుకోవచ్చు. ఇలా చేస్తే మీ పానీయం మరింత రుచిగా మారుతుంది. రోజూ ఖాళీ కడుపుతో ఈ పానీయం తాగితే మంచి రిసల్ట్ ఉంటుంది.

Also Read: Double Hat-Trick: క్రికెట్‌లో అరుదైన రికార్డు.. ఒకే ఓవర్లో రెండు హ్యాట్రిక్‌లు! సంచలనం సృష్టించిన 12 ఏళ్ల కుర్రాడు

Show comments