NTV Telugu Site icon

Ankle Shackles Sounds: రాత్రిపూట గజ్జల శబ్దం వినబడుతోందా?

Anklet Sound

Anklet Sound

ఆహారం, నీరు మనిషికి ఎంత ఆవశ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర ద్వారానే శరీరానికి కొత్త ఉత్సాహం పొందుతుంది. రోజుకు 8 గంటల పాటు నిద్రించకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజుకు నాలుగు గంటల పాటు నిద్రపోయేవారు.. లేకుంటే అర్ధరాత్రంతా మేల్కొని ఆరు గంటలు నిద్రతో సరిపెట్టుకునే వారు.. మరుసటి రోజు యాక్టివ్‌గా పనిచేయలేరు. కాగా.. గ్రామాల్లో చాలా త్వరగా నిద్ర పోతుంటారు. మధ్య రాత్రి లేచినప్పుడు గజ్జల సవ్వడి వినపడుతోందని చెబుతుంటారు. లేదా.. గజ్జల శబ్దానికే కొందరు నిద్ర లేచి కంగారు పడుతుంటారు. ఎంతో భయాందోళనకు గురవుతుంటారు.

READ MORE: Free Liquor Demand: మగాళ్లకి వారానికి రెండు మద్యం బాటిళ్లు ఫ్రీగా ఇవ్వలి.. అసెంబ్లీలో ఎమ్మెల్యే డిమాండ్

అయితే.. రాత్రి పూట గజ్జల చప్పుడు వినబడితే మంచిదా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. పలువురి పండితు వివరణ ప్రకారం.. అర్ధరాత్రి 12 గంటల నుంచి మూడు వరకు గజ్జల శబ్దం వినపడితే, అది ఎంతో మంచిదట. మీకు శుభం కలుగుతుందని సూచిస్తుందట. కాబట్టి ఈ సమయంలో గజ్జల శబ్దం వినపడితే భయపడక్కర్లేదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో గజ్జలు శబ్దం మీకు వినబడితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు దానికి అర్థమంటున్నారు. లేదంటే కులదేవత, గ్రామ దేవత సంచరిస్తున్నట్లు దానికి అర్థమని చెబుతున్నారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని వివరిస్తున్నారు.

                  నోట్: పలువురు పండితులు, వెబ్‌సైట్ల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ వివరణ ఇచ్చాం.. దీంతో పాటు మరేమైనా కారణాలు ఉండొచ్చు.