ఇప్పుడు దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ వర్షాలకు వేడి వేడిగా ఏదైనా తినాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు..మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన బజ్జీ వెరైటీలలో మసాలా మిర్చి బజ్జీ కూడా ఒకటి. ఈ బజ్జీలు పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎంతో సులభంగా చేసుకోదగిన ఈ రుచికరమైన మసాలా బజ్జిలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు..
నువ్వులు – 3 టేబుల్ స్పూన్స్,
చింతపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్,
ఉప్పు – తగినంత,
బజ్జీ మిర్చి – 10,
శనగపిండి – ఒక కప్పు,
వాము – అర టీ స్పూన్,
వంటసోడా – పావు టీ స్పూన్,
నూనె – డీప్ ప్రైకు సరిపడా..
తయారీ విధానం :
మసాలా బజ్జి కోసం ముందుగా నువ్వులను వేయించి పక్కన పెట్టుకోవాలి.. వీటిని మెత్తని పొడిగా చేసుకుని గిన్నెలో కి తీసుకోవాలి. తరువాత ఈ నువ్వుల పొడిలో ఉప్పు, చింతపండు రసం వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత బజ్జీమిర్చీలకు నిలువుగా గాట్లు పెట్టుకోవాలి. తరువాత లోపల ఉండే గింజల ను తీసేసి అందులో నువ్వుల మిశ్రమాన్ని స్టపింగ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో శనగ పిండిని తీసుకోవాలి. ఇందులో వాము, ఉప్పు, వంట సోడా వేసి కలపాలి.. నీళ్లు తగినన్ని పోసుకొని జారుడుగా కలుపుకోవాలి.. అంతే బజ్జీల ను మధ్యస్థ మంటపై గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిర్చీ బజ్జీలు తయారవుతాయి. వేడి వేడిగా వీటిని తింటే చాలా రుచిగా ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు ఇలా రుచికరమైన బజ్జీలను వేసుకోవాలి.. బజ్జీలు రెడీ.. ఈ వర్షాలకు ఇలా చేసుకొని తింటుంటే ఎన్ని తిన్నా తినాలానే అనిపిస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు .. మీకు నచ్చితే మీరు ట్రై చెయ్యండి..