Site icon NTV Telugu

Food Safety Tips: గుడ్డు కుళ్లిపోయిందో లేదో ఇలా చెక్ చేయండి..

Food Safety Tips

Food Safety Tips

Food Safety Tips: ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతీ ఒక్కరూ రోజూ వారి ఆహారంలో గుడ్డును భాగం చేసుకుంటున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదే ఆ గుడ్డు కుళ్లిపోయిందో లేదంటే మంచిదో అనేది తెలియకపోవడం. నిజానికి కుళ్లిపోయిన గుడ్డు తింటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. మీరు తినే గుడ్డు మీకు హాని కలిగిస్తుందో లేదో గుర్తించడానికి ఈ మార్గాలు ట్రై చేయండి..

READ ALSO: T20 World Cup: భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌నే ఎందుకు ఎంచుకున్నారు..?

నిజానికి గుడ్లు ప్రోటీన్, అలాగే అనేక ఇతర పోషకాలకు అద్భుతమైన మూలంగా పని చేస్తున్నాయి. గుడ్లలో విటమిన్లు E, B12, D, A, K ఉంటాయి. వీటిలో సెలీనియం, భాస్వరం, జింక్, ఇనుము వంటి ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే వాటిని తినేటప్పుడు కొన్ని మాత్రం చేయకూడదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నీటిలో గుడ్డును ఎలా ఉడకపెట్టాలి అనే వీడియో ఒకటి వైరల్ అవుతంది.. ఒక కుండలో చల్లటి నీటిని నింపి, అందులో పచ్చి గుడ్డు ఉంచండి. గుడ్డు అడుగున మునిగిపోతే, అది తాజాగా ఉంటుంది, కానీ అది తేలుతుంటే, అది చెడిపోయే అవకాశం ఉందని ఈ వీడియోలో చెబుతున్నారు.

మీరు ఎప్పుడైనా ఎగ్ షేక్ టెస్ట్ ప్రయత్నించారా. దీని అర్థం మీ చెవి దగ్గర గుడ్డును సున్నితంగా కదిలించడం. ఆ టైంలో గుడ్డు నుంచి ఎటువంటి శబ్దం రాకపోతే అది తాజాగా ఉందని సూచిస్తుందని చెబుతున్నారు. అలాగే గుడ్డు వాసన కూడా అది తాజాగా ఉందో లేదో తెలియజేస్తుంది. ఒక ప్లేట్‌లోకి గుడ్డు పగలగొట్టి వాసన చూడండి. అది తాజాగా ఉంటే, దానికి తేలికపాటి వాసన ఉంటుంది. అయితే చెడిపోయిన గుడ్డు బలమైన, కుళ్లిన వాసన కలిగి ఉంటుంది. నిజానికి మీరు గుడ్డును పగలగొట్టి, పచ్చసొన, తెల్లసొనను పరిశీలించడం ద్వారా కూడా ఈ పరీక్ష చేయవచ్చు. తెల్లసొన మందంగా లేకపోతే, దానిని తినకుండా ఉండండి. గుడ్డు పచ్చసొనలో ఆకుపచ్చ, నీలం లేదా నల్ల మచ్చలు ఉంటే, అది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదండీ గుడ్డు తాజాగా ఉందో లేదో తెలుసుకోడానికి సులువుగా ఉండే మార్గాల కథ.

READ ALSO: Mega 158 Update: బాస్‌తో జోడి కట్టబోతున్న ఫ్యామిలీ మ్యాన్ బ్యూటీ!

Exit mobile version