NTV Telugu Site icon

Lifestyle : మీకు విపరీతంగా కోపం వస్తుందా? అయితే ఈ టిప్స్ ను తప్పక పాటించాల్సిందే..

Angryy

Angryy

కొంతమందికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు.. ఊరికే కోపపడతారు.. అలాంటప్పుడు ఏం చేస్తామో ఏం తెలియదు. చాలా నష్టపోతారు. అలా కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకోండి. వీటి వల్ల చాలా హెల్ప్ అవుతుంది… కోపాన్ని కంట్రోల్ చేసే టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

*. కోపాన్ని కంట్రోల్ చేయడానికి బ్రీథింగ్ వర్కౌట్స్ హెల్ప్ చేస్తాయి. మనస్సుని శాంతపరచడానికి సులభమైన మార్గం నెమ్మదిగా, డీప్ బ్రీథింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్‌గా బ్రీథింగ్ వర్కౌట్స్ చేయాలి..

*. ఏదైనా విషయం వల్ల బాగా ఒత్తిడిడికి గురైతే ఏవేవో ఆలోచనలు వస్తాయి.. ఏదయినా చెయ్యాలని అనుకుంటారు.. అలాంటి ఆలోచనలను వెంటనే పక్కన పెట్టండి..

*. మనస్సుని కంట్రోల్ చేయాలి. ఏవేవో ఆలోచనల కారణంగానే చాలా మందికి కోపం వస్తుంటుంది. అలాంటి ఆలోచనలు రాకుండా మనసుని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి.. వేరే వాటిపై దృష్టి పెట్టడం మంచిది..

*. మనసుకి సంతోషాన్ని కలిగించే సంగీతాన్ని వినడం మంచిది. దీని వల్ల చాలా రిలాక్స్‌గా ఉంటుంది. కాబట్టి, కోపంగా ఉన్నా, మనసు బాలేకున్నా చక్కని సంగీతం వినండి.. కాసేపు ఈలోకాన్ని మర్చిపోండి.. చాలా ప్రశాంతంగా గడపండి..

*. ఇకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైన కొంత మంది వ్యక్తులు ఉంటారు. మీ మనసు బాలేనప్పుడు వారితో టైమ్ స్పెండ్ చేయండి. వారితో మీ ఆలోచనలని పంచుకోండి. దీని వల్ల మనశ్శాంతిని అందించేందుకు హెల్ప్ చేస్తుంది..

*. పచ్చని ప్రకృతి లో చల్లగాలికి అలా కూర్చుంటే మనసుకు తెలియని ఆనందం కలుగుతుంది.. కాసపు అలా వాక్ చెయ్యండి..

*. నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, హ్యాపీగా నిద్రపోండి. దీని వల్ల మనసు ప్రశాంతత అందుతుంది. రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి..

*. మీ మానసిక స్థితిని మెరుగ్గా చేయడం వల్ల ఎక్సర్‌సైజ్ బాగా హెల్ప్ చేస్తుంది. దీని వల్ల మన సమస్యలు చాలా వరకూ దూరమవుతాయి. కాబట్టి, రెగ్యులర్‌గా వర్కౌట్ చేయండి..

*. యోగాను చెయ్యండి..కోపాన్ని తగ్గించడంలో యోగ బెస్ట్ చాయిస్.. యోగాని కూడా ఫాలో అవ్వండి. వీటన్నింటి వల్ల చాలా వరకూ మీరు కోపాన్ని తగ్గించుకోవచ్చు… ఇలా వీటిని ఫాలో అయితే కోపం కంట్రోల్ అవుతుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.