Site icon NTV Telugu

Health Tips: ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు..ఏ రోగాలు మీ దరిచేరవు..

Lemone Ea

Lemone Ea

ఉదయం లేవగానే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది.. అదే విధంగా కాఫీ కూడా తాగందే తెల్లారదు.. అయితే పరగడుపున ఆ టీ, కాఫీలను తాగడానికి బదులుగా లెమన్ టీ తాగడం మంచిదని నిపుణులు అంటున్నారు..ఈ టీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తాగుతారు. రుచితో పాటు ఈ టీ ని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు..ప్రతిరోజూ ఒక కప్పు లెమన్ టీ ని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ టీ ని తాగడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయి.

అదే విధంగా ఈ లెమన్ టీ ని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. నిత్యం తలెత్తే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము…ఈ టీ ని తాగడం వల్ల జలుబు, జ్వరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేటప్పుడు ఈ టీ ని తాగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఈ టీ ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ టీ ని తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. దాంతో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.. నోటి సమస్యలు, దంతాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు..

ఒక టీ స్పూన్ టీ పౌడర్ వేసి నీటిని వేడి చేయాలి. ఈ డికాషన్ ను రెండు నిమిషాల పాటు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి కప్పులో పోసుకోవాలి. తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని, రుచికి తగినంత తేనెను వేసి కలపాలి. తరువాత ఇందులో రెండు లేదా మూడు పుదీనా ఆకులను వేసి తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు..శరీర ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ లెమన్ టీ మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ విధంగా లెమన్ టీ మనకు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.. చూసారుగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. మీరు కూడా ట్రై చెయ్యండి..

Exit mobile version