Site icon NTV Telugu

Kodiguddu Karam : ఇలా కోడిగుడ్డు కూరను చేస్తే.. కంచం ఖాళీ చేస్తారు..

Kodiguddu Karam

Kodiguddu Karam

రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు..అయితే రోజూ ఒకేలా కాకుండా రకరకాల కూరలను చేసుకోవాలని అనుకొనేవాళ్ళు ఒకసారి కోడిగుడ్డు కారం ను కొత్తగా ఇలా ట్రై చేసుకోవచ్చు.. ఎముకలు ధృడంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. ఈ విధంగా కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే తయారు చేయడం కూడా చాలా సులభం.. మరి ఆలస్యం ఎందుకు ఒకసారి ఎలా చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు – 4,

నూనె – 4 టేబుల్ స్పూన్స్,

ఉడికించిన కోడిగుడ్లు – 6,

కరివేపాకు ఒక రెమ్మ, కారం – అర టీ స్పూన్,

ఉప్పు – పావు టీ స్పూన్,

పసుపు – పావు టీ స్పూన్…

కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..

ఎండుమిర్చి – 12,

నువ్వులు – ఒక టీ స్పూన్,

జీలకర్ర – ఒక టీ స్పూన్,

ఎండు కొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్,

పుట్నాల పప్పు – 3 టేబుల్ స్పూన్స్,

ఉప్పు -తగినంత..

ధనియాలు – ఒక టేబుల్ స్పూన్,

వెల్లుల్లి పాయ – 1,

తయారీ విధానం :

కోడి గుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.. ఆతర్వాత కారం కోసం అన్నీ సిద్ధం చేసుకొని కారం ను తయారు చేసుకోవాలి..జార్ లో కారం పొడికి కావల్సిన పదార్థాలు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి.తరువాత ఉడికించిన కోడిగుడ్లను వేసి 2 నిమిషాలపాటు బాగా వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఇదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత కరివేపాకు, వేయించిన కోడిగుడ్లు వేసి బాగా కలపాలి.. కొంచెం కలర్ మారేవరకు వీటిని ఒకసారి వేయించాలి.. ఆ తర్వాత ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న కారం ను వేసుకోవాలి.. గుడ్లకు మొత్తం బాగా పట్టేలా చేసుకోవాలి.. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు కారం తయారవుతుంది.. అంతే నో్రూరించే గుడ్డు కారం రెడీ అయినట్లే.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..

Exit mobile version