Kitchen Tips: ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.. ఆకుకూరలు ఫ్రెష్ గా ఉంటాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది..వాటిని రోజు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటాయి..తోటకూర, పాలకూర, మెంతి, బచ్చలి, గోంగూర.. లాంటి ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, ఐరన్, ఫోలేట్, ప్రొటీన్లు, విటమిన్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వీటిలోని సి, ఇ విటమిన్లు, బీటా కెరొటిన్ కంటిచూపును మెరుగుపరుస్తాయి, యాంటీఆక్సిడెంట్లు గాయాలను తగ్గిస్తాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అందుకే వైద్యులు రోజూ ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు.. రోజు కొనలేము.. ఒకసారి తెచ్చుకొని రెండు మూడు రోజులు పెట్టుకొని చేసుకుంటారు.. ఆ తర్వాత ఆకులు పాడై పోతాయి.. ఆకులు కొద్ది రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. అవేంటో ఒకసారి చూసేద్దాం..
ఆకుకూరలు త్వరగా చెడిపోవడానికి కారణం అధిక తేమ..మీరు ఆకుకూరలను స్టోర్ చేసుకోవడానికి, ముందుగా ఆకులు పొడిగా ఉండేలా చూసుకోండి. దెబ్బతిన్న, చెడిపోయిన ఆకులను క్లీన్ చేయండి. ఆ తర్వాత శుభ్రమైన క్లాత్‌లో చుట్టి రిఫ్రిజిరేటరలో పెట్టండి. ఇలా చేస్తే.. ఆకుకూరలు పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి..
Also Read
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
ఆకుకూరలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. ఆకులను కత్తిరించి జిప్ లేదా లాక్ బ్యాగ్‌లో ఉంచండి. దీన్ని ఫ్రీజర్‌లో స్టోర్ చేయవచ్చు.. ఇలా చేసినా ఆకులు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి..
అరటిపండ్లు, కివీస్ వంటి పండ్లు ఇథిలీన్ గ్యాస్‌ను రిలీజ్ చేస్తాయి. ఇది పండ్లు, కూరగాయలు సహజంగా పండించడానికి సహాయపడుతుంది. బచ్చలికూర ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఇథిలీన్ గ్యాస్ రిలీజ్ చేసే పండ్లకు దూరంగా గాలి చొరబడని కంటైనర్‌లో స్టోర్ చేయాలి.. అప్పుడే తాజాగా ఉంటాయి..
ఆకుకూరలు కొన్న తర్వాత.. ముందుగా వాటిలోని చెడిపోయిన ఆకులను తీసి క్లీన్ చేయండి. ఆ తర్వాత, కాడలు కత్తిరించండి. వీటిని న్యూస్ పేపర్‌లో పెట్టి రోల్ చేయండి. ఈ రోల్‌ను జిప్-లాక్ బ్యాగ్‌లో ఉంచండి. సీల్ చేసే ముందు బ్యాగ్ నుంచి లోపల గాలి లేకుండా చూసుకోండి. ఈ బ్యాగ్‌ను రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేయండి..
అదే విధంగా..ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేయండి. ముందుగా వాటిలో పాడైన ఆకులను క్లీన్ చేయండి, ఆకుకూరల చివర్ల కట్ చేయండి. ఎయిర్ టైట్ కంటైనర్‌లో మస్లిన్ క్లాత్ వేసి, ఈ ఆకుకూరలను దానిలో ఉంచండి. ఆ తర్వాత ఆకుకూరను డబ్బాలో ఉంచండి.. ఇలా చేసిన ఆకు కూరలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయని నిపుణుకు చెబుతున్నారు.. ఇలా ట్రై చేసి చూడండి..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..