మానవ శరీరంలో అన్ని అవయవాలతో పాటు కిడ్నీలు కూడా చాలా ముఖ్యమైనవి.. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తాయి.. అందుకే వీటిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచాలి..అయితే ఏదైనా లోపాలు ఉంటే మాత్రం కిడ్నీల సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా ఈరోజుల్లో కిడ్నీలల్లో రాళ్ల సమస్య ఎక్కువగా వినిపిస్తుంది..ఈ సమస్య వచ్చినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహారణకు కొంతమందికి మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. మరికొంతమందికి కడుపు నొప్పి ఉంటుంది. నడుము కింది భాగంలో అంటే నడుము దగ్గర నొప్పి ఉంటుంది. దీంతో సమస్య వచ్చిన వారికి దానిని తట్టుకోలేకపోతారు.. మన వంటింట్లో ఉండే వాటితో ఈ సమస్య నుంచి బయటపడవచ్చునని నిపుణులు అంటున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లం..
ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యల్ని దూరం చేయడమే కాకుండా అజీర్ణం, మలబ్దకం, వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకి అల్లం చెక్ పెడుతుంది. ఈ సమస్యలతో పాటు కిడీల రాళ్ళ సమస్యని కూడా తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు..శరీరంలోని మలినాలను కలిగించే టాక్సిన్స్‌ని బయటికి పంపి కిడ్నీ, లివర్‌ని కాపాడుతుంది.. అల్లం ను ఎలా తీసుకున్నా పర్వాలేదు..
పసుపు..
పసుపు కూడా అద్భుత ఔషధ గుణాలు కలిగి ఉన్న మూలిక. దీనిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం నుంచి కిడ్నీ సమస్యలు కూడా తగ్గిపోతాయి. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా ఇది ఓ హెల్దీ హెర్బ్ అని చెప్పొచ్చు. దీని ప్రయోజనాలను పొందేందుకు ప్రతిరోజూ పసుపు పాలు తాగడం మంచిది..
కొత్తిమీర..
కొత్తిమీర కూడా బ్లాడర్, యుటెరెస్‌లోని ఇన్ఫెక్షన్ తగ్గేలా చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా వరకూ సమస్య తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.. అలానే తీసుకోవచ్చు లేదా కూరలుగా చేసుకోని తినొచ్చు..
త్రిఫల..
ఆయుర్వేదం లో దీన్ని ఎక్కువగా వాడతారు..మూత్రం ద్వారా శరీరంలో పేరుకుపోయిన విషపూరిత వ్యర్థాలను బయటకు పంపేందుకు మూత్రపిండాలకు సహాయపడుతుంది. దీంతో భవిష్యత్‌లోనూ సమ్యలు రావు. త్రిఫల చూర్ణాన్ని ఓ గ్లాసు నీటిలో కలిపి ప్రతిరోజూ తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలన్నీ దూరం అవుతాయి.. ఇవన్నీ కూడా కిడ్నీలో రాళ్లను తగ్గిస్తాయి..
