Karivepaku Rice : కేవలం 10 నిమిషాల్లో రెడీ అయ్యే కరివేపాకు రైస్ ను ఇలా చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడూ ఇడ్లి, దోస ఉప్మా, పెసరట్టు మాత్రమే కాదు తక్కువ టైం లో నోటికి రుచిగా ఉండేలా చేసుకునేవి చాలానే ఉంటాయి..అలాంటి వాటిలో కరివేపాకు రైస్ కూడా ఒక్కటి..కరివేపాకును వాడడం వల్ల మన జుట్టుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.. అందుకే చాలా మంది పచ్చళ్ళు, పొడ్లు పెట్టుకొని తింటారు.. మరికొంత మంది రైస్ లను చేస్తుంటారు.. కరివేపాకుతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా కరివేపాకు రైస్ ను ఇన్ స్టాంట్ గా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు..
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
అన్నం – పావు కిలో బియ్యంతో వండినంత,
నూనె – 2 టేబుల్ స్పూన్స్,
తాళింపు దినుసులు- ఒక టేబుల్ స్పూన్,
పల్లీలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్,
జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్,
కరివేపాకు -ఒక రెమ్మ,
ఇంగువ – కొద్దిగా,
ఉప్పు- తగినంత..
రైస్ కోసం కారం పొడి..
నూనె – ఒక టేబుల్ స్పూన్,
శనగపప్పు – ఒక టీ స్పూన్,
మినపప్పు -ఒక టీ స్పూన్,
జీలకర్ర – అర టీ స్పూన్,
మిరియాలు – అర టీ స్పూన్,
ధనియాలు – ఒక టీ స్పూన్,
ఎండుమిర్చి – 5,
వెల్లుల్లి రెబ్బలు – 4,
చింతపండు – ఒక రెమ్మ,
నువ్వులు – ఒక టీ స్పూన్,
కరివేపాకు – గుప్పెడు..
తయారీ విధానం..
ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె వేసి వేడి చేయాలి. తరువాత కారం పొడికి కావల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. వీటిని మాడిపోకుండా చిన్న మంటపై కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని బరకగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి..ఆ తర్వాత అన్నం వేసి కలపాలి.. తరువాత ఉప్పు, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మరో రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు రైస్ తయారవుతుంది.. ఇది వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.. మీరు కూడా ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు