NTV Telugu Site icon

Summer Tips : వేసవి లో ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు..

Samar

Samar

చూస్తుండగానే వేసవి వచ్చేసింది.. మే రాకముందే రోజు రోజుకు టెంపరేచర్ పెరిగి ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేకపోతే.. ప్రాణాంతక వ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉంది. సాధారణంగా వర్షాకాలం, చలికాలం లో వ్యాధులు ఎక్కువగా వస్తాయని అనుకుంటారు. కానీ, వేసవిలో కూడా కొన్ని వ్యాధులు ముప్పుతిప్పలు పెడతాయి. కనుక ముందు జాగ్రత పడితే ఎలాంటి సమస్యలు ఉండవు.

Also Read: NTR Fan : తారక్ అభిమాని మృతి

1. చాలా మంది వాటర్ తాగడంలో నిర్లక్ష్యం చేస్తారు. రోజుకి కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగండి. అలాగే మీ రోజువారీ ఆహారంలో కొబ్బరి నీరు, మజ్జిగ లేదా నిమ్మరసం చేర్చుకోండి. ఇలా చేయడం వల్ల వేసవిలో డి-హైడ్రేటెడ్ సమస్య బారిన పడకుండా ఉంటారు.‎ హైడ్రేటెడ్‎గా ఉంటారు. అన్నం తినంగానే మజ్జిగ తాగండి. సాయంత్రం మరో గ్లాస్ నిమ్మరసం తాగండి ఇలా చేయడం మూలంగా బాడీలో శక్తి పెరుగుతుంది.

2. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయట తిరగడం తగ్గించండి. అవసరమైతే తప్ప బయటకు రావద్దు. ఎందుకు ఈ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ తగిలితే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం..శరీరం అదుపు తప్పుతుంది. నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలు, కాలేయం తదితర భాగాలు దెబ్బతిని ప్రాణం పోయే ప్రమాదం ఉంది. అందుకే ఒక వేల ఈ సమయంలో బయటకు వెళ్ళిన కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్ వాటర్ దగ్గర ఉంచుకోండి. అవి అందుబాటులో లేకపోతే చక్కెర, ఉప్పు కలిపిన నీరు తాగండి. దీని వల్ల కూడా మంచి శక్తి అందుతుంది.

3. పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, మద్యం అతిగా తాగే వాళ్ళు ఎక్కువగా వడదెబ్బకు గురవుతారు. అంతే కాదు శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నా,గుండె వేగంగా కొట్టుకోవడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమట పట్టకపోవడం, కాళ్లు చేతులు నొప్పులు, శరీరం తిమ్మిరి, వాంతులు, తలనొప్పి, స్పృహ కోల్పోవడం వంటివి వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగిలితే కనుక శరీరాన్ని తడిగుడ్డతో తుడిచి చల్లబరచాలి. నీళ్లు తాగించి, వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి.

4. వేసుకునే దుస్తుల విషయంలో కూడా సమర్ లో జాగ్రత్తగా ఉండాలి. వదులుగా, లేత రంగు కాటన్ దుస్తులు ధరించండి. ఎల్లప్పుడూ బయట టోపీ, స్కార్ఫ్ లేదా గొడుగును తీసుకెళ్లండి. డార్క్ కలర్ బట్టలు వేడిని త్వరగా గ్రహిస్తాయి.చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో ఒంట్లో నీరు శాతం తగ్గి కళ్లు తిరుగుతాయి. కనుక తెలికపాటి కాటన్ డ్రెస్ లు ప్రిఫర్ చేయండి.

5. ఇక ఎండాకాలంలో AC ని నాన్-AC పరివర్తన చూసుకోండి. ఎందుకంటే అధికంగా చల్లదనంలో ఉండి ఉండి, ఒకేసారి ఎండలోకి వెళితే శరీరం తట్టుకోవడం కష్టం. అందుకే బయటకు అడుగు పెట్టే ముందు, మీ శరీరం అలవాటు పడేలా తక్కువ ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో కొన్ని నిమిషాలు గడపండి. దీంతో ఎండలో బయటకు వెళ్ళినప్పుడు కాస్త ఉపశమనం లభిస్తుంది. కూలర్‌కి ఎంత ధూరం అంటే అంత మంచిదని నిపుణులు పేర్కోంటున్నారు. ఎందుకంటే కులర్‌తో ఎక్కువగా లెన్స్ ప్రాబ్లంమ్స్ వస్తున్నాయి. పిల్లలు పెద్దలు కులర్‌కి ధూరంగా ఉండాలి.

6. ఇక పండ్ల విషయంలో పుచ్చకాయ, కర్బుజా, కీరదోస వంటి నీటి సాంద్రత ఎక్కువ ఉన్న పండ్లు తీసుకోండి. కారం, ఆయిల్ ఫుడ్స్‌, ఫాస్ట్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. అలాగే అధిక భోజనం కూడా మానుకోండి. అపరిశుభ్ర ఆహారం, నీరు తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇంట్లో కూడా పరిశుభ్రత పాటించండి. అపరిశుభ్రత గా ఉండటం వల్ల టైఫాయిడ్ మాత్రమే కాదు, అతిసారా కూడా సోకుతుంది. వేసవిలో విరేచనాలు వస్తున్నట్లయితే తప్పకుండా వైద్యులను సంప్రదించండి. అలాగే, వేసవిలో కామెర్లతో కూడా జాగ్రత్తగా ఉండాలి.