పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసాలు (రోజా) ప్రారంభించారు. ఇక రంజాన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీం. ముందుగా ఈ హలీం ను ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఇరాన్ దేశంలో ప్రారంభించారు. ఇది క్రమంగా ఇరాన్ దేశం నుంచి నేడు భారతదేశానికి పాకింది. దీంతో ఇప్పుడు మారుమూల గ్రామాల్లో సైతం హలీం వ్యాపించి హిందూ, ముస్లింలను తన వద్దకు రప్పించుకుంటుంది చెప్పాలంటే ముస్లిం సోదరుల కంటే కూడా హిందువులే హలీం రుచులకు ఎంతో ఆకర్షితులవుతున్నారు. దీంతో మార్కెట్‌ల్లో హలీం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. అయితే నోరూరించే హలీంలో ఉండే పోషకాలు శరీరాన్నిఎంతో ఆరోగ్యంగా చేస్తాయి. కానీ కొంత మంది మాత్రం ఈ హలీం జోలికి పోకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాలు విలుసుకుందాం..
* అయితే హలీం తయారీలో చికెన్ తో పాటుగా ఎక్కువగా గోధుమలను వాడతారు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది, కానుకు దీని తినడం వలన జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి.
* ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన,ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం. అలాగే ఇందులో జీడిపప్పు, శనగపప్పు, మినప్పప్పు వంటి ప్రోటీన్లు ఉండే పప్పులను కూడా వాడతారు. ఇది శరీరంలోని కండరాలని బలోపేతం చేయడమే కాకుండా, రిపేర్ చేసి మరింత బలం మారుస్తాయి.
* హలీం తయారీలో అల్లం, వెల్లుల్లి, పసుపు
ను కూడా ఉపయోగిస్తారు. వీటిలో ఉండే పొటాషియం కారణంగా హైబీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి.ఇది గుండె సమస్యల్ని కూ దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆందోళన, ఒత్తిళ్ల నుంచి కూడా రక్షిస్తుంది.
వారు మాత్రం తినకూడదు..
మధుమేహంతో బాధపడేవారు హలీం ని చక్కగా తీసుకోవచ్చు. ఇందులో ఉండే సోడియం నాడీ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. కానీ ఇందులో అధిక మొత్తంలో ఉప్పు, నూనె వినియోగం ఉంటుంది కాబట్టి వీటిని, గుండె అనారోగ్యం ఉన్నవారు.. ఇంట్లోనే తగిన మోతాదులో వేసి తయారు చేసుకున్న హలీం తినడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చిన్న పిల్లలకు కూడా హలీం అంత మంచిది కాదు. ఇందులో వాడే ఘాటైన పదార్ధలు వారి జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తాయి. గర్భిణీలు కూడా అధిక మోతాదులో తినకూడదు. వృద్ధులు కూడా ఇంట్లో తక్కువ మసాలాతో చేసుకున్న హలీం తినడం మంచిది.