Site icon NTV Telugu

Amun Fruit: గర్భిణీలు నేరేడు పండు తింటున్నారా..!

Jamun During Pregnancy

Jamun During Pregnancy

వేసవి చివర్లో, వర్షా కాలం ఆరంభంలో అధికంగా కనిపించే పండు నేరేడు పండు. చిన్ననాటి జ్ఞాపకాలు గా ఉండే ఈ నలుపు ఊదా రంగు పండు రుచి పరంగా అద్భుతమైనదే కాదు, ఆరోగ్యానికి అనేక లాభాలు కూడా కలిగిస్తుంది. నేరేడు పండ్లలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్​ని కంట్రోల్​లో ఉంచుతుంది. అయితే ఎక్కువగా తినడం వల్ల బెనిఫిట్స్​ కాస్త సైడ్ ఎఫెక్ట్స్​గా మారుతాయట. కాబట్టి ఎక్కువగా తినడం కంట్రోల్ చేసుకుంటే మంచిదని చెప్తున్నారు. అంతే కాదు ఎక్కువగా తింటే హైపోటెన్షన్ పెరిగి.. బీపీ రాపిడ్​గా తగ్గిపోతుంది. ఇది కళ్లు తిరగడం వంటి సమస్యలను పెంచుతుంది. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు ఈ పండ్లు తినాలా? తింటే ఎంత మోతాదులో తినాలి? అన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి. వాటికి సమాధానమే ఈ వ్యాసం.

ఆరోగ్య ప్రయోజనాలు:
నేరేడు జీర్ణం మెరుగుపరుస్తుంది – మలబద్ధకం, అజీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచి సహాయం చేస్తుంది. తక్కువ కేలరీలతో తక్షణ శక్తిని ఇచ్చే పండు కావడం వల్ల అలసటను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును నియంత్రించే, గుండెను కాపాడే గుణాలు ఇందులో ఉన్నాయి. కాలేయం, ప్రేగులు, ఆర్థరైటిస్ సమస్యలకి ఉపశమనం అందిస్తాయి.

హానికర ప్రభావాలు (అధికంగా తినితే):
ఈ నేరేడు అధికంగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, ఇందులో ఉండే ‘ఆక్సలేట్’ అనే పదార్థం, శరీరంలో కాల్షియం తో కలిసి రాళ్లకు దారి తీస్తుంది. అలాగే రక్తపోటు అధికంగా తగ్గిపోవచ్చు, తల నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు అధిక మోతాదులో తింటే ఏర్పడతాయి. దంత ఆరోగ్యం, నోట్లో ఆమ్లం ఉత్పత్తి పెరిగి దంత ఎనామెల్‌ను ప్రభావితం చేస్తుంది.

గర్భిణీలకు ప్రత్యేక సూచనలు:
గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా 6 నెలల తర్వాత ఈ పండును తినాలంటే డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. హార్మోన్ల మార్పులు, జీర్ణ సంబంధిత సున్నిత పరిస్థితులు ఈ దశలో ఎక్కువగా ఉండటంతో, ఏ పండును అయినా మితంగా తీసుకోవాలి. సాధారణంగా, రోజుకు 100 గ్రాముల వరకే తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నెరేడు తిన్న వెంటనే నోటిని కడగడం, బ్రష్ చేయడం అవసరం. ముఖ్యంగా రాత్రిపూట తినే పండ్లు మరింత జాగ్రత్త అవసరం.

ముగింపు 
నేరేడు పండు సహజంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ అది మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే మంచిది. ముఖ్యంగా గర్భిణీల విషయంలో ఈ పండును తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం చాలా అవసరం. రోజువారీ పరిమితిని పాటిస్తూ, శుభ్రమైన పండును, అవసరమైన జాగ్రత్తలతో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

 

Exit mobile version