Hair Fall Causes: ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. ఉదయం నిద్రలేవగానే దిండుపై జుట్టు, స్నానం చేసేటప్పుడు, దువ్వెనలో జుట్టు రాలిపోతూ కనిపించడం చాలా మందిని బాధకు గురి చేస్తుంది. వాస్తవానికి ఈ సమస్య వృద్ధాప్యం వల్ల మాత్రమే రాదని, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏం చేస్తే జట్టు రాలిపోవడం తగ్గుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Putin: భారత్‌తో దోస్తీ, యూరప్‌కు వార్నింగ్.. పుతిన్ సంచలన వ్యాఖ్యలు..
అసలు కారణం ఇదే..
మన శరీరంలో DHT (డైహైడ్రోటెస్టోస్టెరాన్) అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ క్రమంగా సన్నబడి జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. ఇది తలపై ఉన్న సెబమ్‌తో కలిసిపోయి, వేర్ల చుట్టూ పేరుకుపోయినప్పుడు, అది జుట్టుకు పోషకాలు, ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటుంది. అప్పుడు వేర్లు శ్వాస తీసుకోలేక బలహీనపడి జుట్టు రాలిపోతుంది. చాలా మంది జుట్టును రోజూ కడగడం వల్ల జుట్టు రాలుతుందని అనుకుంటారు. కానీ ఈ సందర్భంగా పలువురు నిపుణులు మాట్లాడుతూ.. ఇక్కడ సమస్య జుట్టు కడుక్కోవడంలో లేదని, తలపై చర్మం మురికిగా ఉండటంలో ఉందని వెల్లడించారు. వారానికి 5-6 రోజులు జిమ్‌కు వెళ్లి, విపరీతంగా చెమటలు పట్టి, దుమ్ములో ఉండి, ఆపై జుట్టును కడుక్కోకపోతే, తలపై నూనె, చెమట పేరుకుపోయి DHTని మరింతగా తగ్గిస్తుందని అన్నారు. అందుకని రోజుకు ఒకసారి కూడా తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును కడగడం మంచిదని సూచించారు. కానీ జుట్టును కడుక్కోవడానికి రెండు పనులు చేయాలని, మొదటగా షాంపూ వేసిన తర్వాత, తలపై 2 నిమిషాలు తేలికగా మసాజ్ చేయాలని, ఇది రక్త ప్రసరణను పెంచుతుందని. రెండవది భారీగా నురుగు, గట్టి షాంపూల వినియోగాన్ని నివారించాలని అన్నారు.
తలపై చర్మం నూనె, ధూళితో మూసుకుపోయినప్పుడు, ఏ సీరం, నూనె లేదా మందులు పనిచేయవని వెల్లడించారు. అయితే తలపై చర్మం శుభ్రంగా ఉంటే, ఈ పదార్థాలు త్వరగా మూలాలకు చేరుతాయని చెప్పారు. వాస్తవానికి జుట్టు మూలాలు రక్తం నుంచి పోషకాలను పొందుతాయి. రక్తంలో పోషకాలు తక్కువగా ఉంటే, ఉత్తమ షాంపూలు కూడా పనిచేయవని చెప్పారు. దీనిని పరిష్కరించడానికి ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆహారంలో జింక్, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలని, నెత్తిమీద చర్మం పొడిబారకుండా ఉండటానికి ప్రతిరోజూ 6-8 గ్లాసుల నీరు తాగాలని, జంక్ ఫుడ్, అదనపు చక్కెర, సోడాను పరిమితం చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఇవి అధిక ఇన్సులిన్ స్థాయిలను DHTని పెంచుతాయని వెల్లడించారు. అలాగే 6-8 గంటల గాఢ నిద్రపోకపోతే శరీరంలో ఒత్తిడి పెరుగుతుందని, దీంతో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుందని చెప్పారు. ఇది నేరుగా DHT ని పెంచుతుందని అందుకని జుట్టు పెరుగుదలకు గాఢ నిద్ర చాలా కీలకం అని వెల్లడించారు.
READ ALSO: GOAT Teaser: నవ్వులు పంచేలా.. సుడిగాలి సుధీర్ GOAT టీజర్..
