Bathroom Cleaning Tips: మీ బాత్‌రూమ్ గార పట్టిందా? ఇలా చేస్తే పది నిమిషాల్లో కొత్తదానిలా మార్చేయొచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathroom Cleaning Tips: సాధారణంగా ఇంట్లోని బాత్‌రూమ్ టైల్స్, ఫ్లోర్ కొన్నాళ్లకు తెల్లటి గార పట్టి లేదా మొండి మరకలతో నిండిపోతుంటాయి. వీటిని వదిలించడానికి చాలా మంది మార్కెట్లో దొరికే హార్పిక్ లేదా యాసిడ్ వంటి ఘాటైన కెమికల్స్ వాడుతుంటారు. నిజానికి ఇవి ఆరోగ్యానికి, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి అంత మంచిది కాదు. అయితే ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే ఒక అద్భుతమైన లిక్విడ్ తయారు చేసుకుని బాత్‌రూమ్‌ను కొత్తదానిలా మెరిపించవచ్చని మీలో ఎంత మందికి తెలుసు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
Also Read
- Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
- Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
- Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
- Ring Removal Tips: మీ ఉంగరం వేలికి ఇరుక్కుపోయిందా..? సింపుల్‌గా తీసే చిట్కాలు ఇవే..
వేడి నీళ్లు: తగినన్ని ..
సర్ఫ్ లిక్విడ్ లేదా వాషింగ్ మెషీన్ లిక్విడ్: కొద్దిగా
షాంపూ: ఏదైనా బ్రాండ్ (ఒకటి లేదా రెండు చిన్న ప్యాకెట్లు)
వంట సోడా: 2 టీ స్పూన్లు
వెనిగర్: అర గ్లాసు
హ్యాండ్ వాష్ లిక్విడ్: కొద్దిగా
టూత్ పేస్ట్: ఏదైనా పర్వాలేదు (కోల్గేట్ వంటివి)
లిక్విడ్ తయారీ విధానం..
ముందుగా ఒక ప్లాస్టిక్ డబ్బా లేదా బకెట్ తీసుకుని అందులో తగినంత వేడి నీటిని పోయాలి. ఆ నీటిలో వాషింగ్ లిక్విడ్, షాంపూ, హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. తర్వాత అందులో రెండు చెంచాల వంట సోడా, అర గ్లాసు వెనిగర్ వేయాలి. వెనిగర్ వేసినప్పుడు అది పొంగుతుంది, ఇది మరకలను వదిలించడానికి బాగా పనిచేస్తుంది. లాస్ట్‌లో కొద్దిగా టూత్‌పేస్ట్ వేసి, దీనిని ఏదైనా పుల్లతో బాగా కలిసేలా కలుపుకోవాలి. తయారు చేసుకున్న ఈ లిక్విడ్‌ను బాత్‌రూమ్ ఫ్లోర్, టైల్స్, గార పట్టిన చోట అంతా చల్లాలి.
లిక్విడ్ చల్లిన తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల మొండి మరకలు మెత్తబడతాయి. అప్పుడు ఆ గార ఉన్న చోట బ్రష్‌తో కొద్దిగా రుద్దితే సరిపోతుంది. ఆ తర్వాత నీటితో కడిగేస్తే బాత్‌రూమ్ తెల్లగా, కొత్తదానిలా మెరిసిపోతుంది. నిజానికి ఈ పద్ధతి వల్ల ఎటువంటి ఘాటైన వాసన రాదు. అలాగే బాత్ రూంను క్లీన్ చేసే టైంలో చేతులకు మంట పుట్టదు, ఈ పద్ధతి ఆరోగ్యానికి కూడా సురక్షితం. నిజానికి ఈ పద్ధతితో చాలా తక్కువ ఖర్చుతో బాత్‌రూమ్ శుభ్రం చేసుకోవచ్చు. ఇకపై మీరు కూడా ఖరీదైన, ప్రమాదకరమైన కెమికల్స్ వాడటం మానేసి, ఈ సింపుల్ చిట్కాను పాటించి మీ బాత్‌రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోండి.
తాజావార్తలు
-
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
-
US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
-
ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
-
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!