రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి ఉన్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. భారతీయ రైల్వేలో మొత్తం 22,593 రైళ్లు ఉన్నాయి. వీటిలో 9,141 సరుకు రవాణా రైళ్లు కాగా, 13,452 పాసింజర్ రైళ్లు. భారతీయ రైల్వే తన సేవలతో దేశం మొత్తాన్ని కలుపుతుంది. అయితే వీటన్నింటికి పేర్లు ఉన్నాయి.. అసలు రైళ్లకు పేర్లు ఎలా పెడతారు.. వాటి లెక్కలు ఎలా ఉంటాయి అనేది చాలామందికి అంతుచిక్కని ప్రశ్న.. వీటికి కూడా ఎన్నో ఆలోచించి.. ఎన్నో లెక్కలు వేసి పేర్లు పెడతారట.. . భారతీయ రైల్వే.. రైళ్లకు మూడు అంశాల ఆధారంగా పేర్లు పెడుతుంది. అవి ఏంటంటే.. స్థలం, నిర్దిష్ట ప్రదేశం, రాజధాని పేర్లు కలిసేలా పెడతారు.
స్థలం: స్థలం లేదా సస్థానం.. ఒక రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది అనే దాన్ని ఆలోచించి పెడతారు. ఫలానా ప్రదేశం నుంచి ప్రారంభమై ఫలానా ప్రదేశానికి వెళ్లేది. ఉదాహరణకు.. ముంబై ఎక్స్‌ప్రెస్.. హైదరాబాద్ -ముంబై మధ్య నడుస్తుంది.. కల్కా మెయిల్ హౌరా నుంచి కల్కా వరకు నడుస్తోంది.. జైపూర్ ఎక్స్‌ప్రెస్ మైసూర్ నుంచి జైపూర్ వరకు నడుస్తుంది. ఇలా ఉంటాయి ఈ కేటగిరి పేర్లు.
నిర్దిష్ట స్థాన ఆధారిత రైళ్లు: ఇక ఇది నిర్దిష్ట ప్రదేశాలను తెలిపేవి. పార్కులు, స్మారక చిహ్నాలు ప్రజలు గుర్తుచేసుకొనేలా పెడతారు. అంతేకాకుండా వాటిని దాటుకొని పోతూ ఉంటాయి కాబట్టి వాటికి ఆ పేర్లు పెడతారు. ఉదాహరణకు ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్.. ఇది హైదరాబాద్ నుండి హౌరా వరకు నడుస్తుంది. మలబార్ ఎక్స్‌ప్రెస్, రణతంబోర్ ఎక్స్‌ప్రెస్, కాజిరంగా ఎక్స్‌ప్రెస్, చార్మినార్ ఎక్స్‌ప్రెస్, తాజ్ ఎక్స్‌ప్రెస్.. ఇలా ఉంటాయి ఈ కేటగిరి పేర్లు.
రాజధాని: పేరులోనే అర్థమైపోతుంది.. ఆ రాజధానులు కలిసేలా రైళ్లకు ప్రత్యేక పేర్లను పెడతారు. ఈ రైళ్లు దేశంలోని అన్ని రాజధానులను అనుసంధానం చేస్తాయి కాబట్టి వాటికి ఆ పేర్లను పెడతారు. ఉదాహరణకు.. రాజధాని ఎక్స్‌ప్రెస్.. ఇది దేశ రాజధాని ఢిల్లీని వివిధ రాష్ట్రాల రాజధానులతో కలుపుతుంది. గరీబ్ రధ్ ఎక్స్‌ప్రెస్.. ఇది డీలక్స్ రైలే అయినా సామాన్యులు కూడా ఎందులో ప్రయాణించవచ్చు. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ .. ఇక ఇది కూడా ఢిల్లీ ని వివిధ రాష్ట్రాల రాజధానులతో కలుపుతుంది.
ఇదండీ రైళ్లకు పేర్లు పెట్టే విధానం.. ఏ రైలుకైనా ఇదే విధంగా భారతీయ రైల్వే పేర్లు నిర్ణయిస్తుంది.